పెళ్లి వార్తలపై స్పందించిన త్రిష... మీ వెనుక ఉన్నది ఎవరో తెలుసంటూ పోస్ట్?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి త్రిష( Trisha ) గురించి తరచూ పెళ్లి వార్తలు వినపడుతూనే ఉంటాయి.

పలానా హీరోతో దర్శకుడితో త్రిష పెళ్లి జరగబోతుంది అంటూ ఈమె పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి అయితే తాజాగా ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నిర్మాతను పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో( Social media ) వార్తలు హల్చల్ చేశాయి.

ఇక ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఈ పెళ్లి వార్తలపై త్రిష స్పందిస్తూ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

త్రిష నిర్మాతను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈమె ట్విట్టర్ వేదికగా ఈ వార్తలపై స్పందించారు.ఈ సందర్భంగా పెళ్లి వార్తలపై స్పందించినటువంటి త్రిష చాలా కూల్ గా సమాధానం చెబుతూ భారీగానే కౌంటర్ ఇచ్చారు.ఇలా పెళ్లి వార్తలను వైరల్ చేస్తున్నారు అంటే మీ వెనుక ఎవరున్నారు నాకు తెలుసు అంటూ ఈమె పోస్ట్ చేశారు.

మీరు మీతో పాటు ఉన్న టీం ఎవరో నాకు తెలుసు.కూల్ గా ఉండండి ఇంతటితో ఈ పుకార్లను ఆపివేయండి చీర్స్ అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

కొందరు ఉద్దేశపూర్వకంగానే తన పెళ్లి గురించి ఇలాంటి పుకార్లను ( Marriage Rumours ) పుట్టిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా త్రిష ( Trisha )తెలియజేశారు.అయితే ఇకపై ఇలాంటి వాటిని ఆపేయాలి అంటూ ఈమె ఈ సందర్భంగా స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కెరియర్ పరంగా చూసుకుంటే త్రిష ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికీ ఈమె పలు సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకొని వాటిలో నటిస్తూ బిజీ అయ్యారు.దీంతో ఈమె పెళ్లి గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలు అన్నీ కూడా అవాస్తవమేనని కొట్టిపారేశారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు