నాలుగు పదుల వయస్సులోనూ త్రిష దూకుడు అస్సలు తగ్గలేదుగా.. గ్రేట్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.

ఆ తర్వాత తమిళం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది త్రిష.సినిమా ఇండస్ట్రీకి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది.

అంతేకాకుండా వయసు పెరుగుతున్న కూడా వన్నె తరగని అందం త్రిష సొంతం అని చెప్పవచ్చు.ఇటీవల త్రిష 40వ పుట్టినరోజు( Trisha 40th Birthday ) వేడుకలను జరుపుకుంది.నాలుగు పదుల వయసులోకి వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్ గానే ఉంటూ చెక్కుచెదరని అందంతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇటీవలె పొన్నియ‌న్ సెల్వ‌న్-2( Ponniyin Selvan-2 ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇందులో త‌న అందం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మైమ‌రిచిపోయారు.మధ్య కెరియర్ డౌన్ అవడంతో ఇక సినిమాలకు త్రిష దూరం అవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

Advertisement

కానీ ఆ తర్వాత మళ్లీ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోవడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది.

ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం అజిత్ హీరోగా మ‌గిల్ తిరుమ‌ణి ఓ సినిమా రూపొందించ‌బోతున్నాడు.లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతోంది.ఇందులో హీరోయిన్ గా త్రిష ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు