ఎల్ఎస్‌డి సీరీస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 2 నుండి ఎమ్ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ !!!

అనిల్ మోదుగ , శివ కోన ( Anil Moduga, Shiva Kona )నిర్మాణంలో శివ కోన దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త వెబ్ సీరీస్ ఎల్ఎస్‌డి.

ప్రాచీ టకర్, నేహా దేస్పాండె, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నటించిన ఈ సీరీస్ కు ప్రవీణ్ మని, శశాంక్ ( Praveen Mani, Shashank )తిరుపతి సంగీతం అందిస్తున్నారు.

అలాగే పవన్ గుంటుకు, హర్ష ఈడిగా సినిమాటోగ్రఫర్స్ గా వర్క్ చేశారు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాకంలో ఫిబ్రవరి 2న ఎమ్ఎక్స్ ప్లేయర్ లో విడుదల కానున్న ఈ వెబ్ సీరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డార్క్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.అన్ని ఎలిమెంట్స్ తో ఈ సీరీస్ రాబోతోందని ట్రైలర్ చేస్తే తెలుస్తోంది.

మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, వారి ఫారెస్ట్‌ ట్రిప్‌ ఎల్ఎస్‌డి వెబ్ సీరీస్ లో ప్రేక్షకులను థ్రిల్ చెయ్యబోతున్నాయి.నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ దర్శకుడు శివ కోన ఈ సీరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు.

Advertisement
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు