ఆర్మీని కూడా అదానీకి అప్పజెప్ప కుట్ర జరుగుతోంది..

అగ్నిపథ్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది సంగారెడ్డి జిల్లా అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష.

పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, TPCCకార్యదర్శి తోపాజి ఆనంతకిషన్ నియోజకవర్గ ఇంచార్జి అంజనేయులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూనసంతోష్ మండల అధ్యక్షుడు బుచ్చిరాములు పట్టణ అధ్యక్షుడు జార్జ్ స్థానిక కౌన్సిలర్లు హఫెజ్ షఫీ నాగరాజు ఉదయ్ భాస్కర్ ఇతర కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్ మహేష్ గౌడ్ యాదగిరి తాహేర్ లతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్.

ఆర్మీని కూడా అదానీకి అప్పజెప్ప కుట్ర జరుగుతోంది ఆర్మీలో నాలుగేళ్లు పని చేసి వచ్చాక ఆడుకుని తినాలా? బిజెపి మాటల్లోనే భారత మాత అంటారు.చేతల్లో ఎక్కడా కనిపించదు జై జవాన్ - జై కిసాన్ కాంగ్రెస్ నినాదం అగ్నిపథ్ పేరుతో బీజేపీ ప్రభుత్వం దేశంలోని యువకులను నిరుద్యోగులుగా చేస్తున్నారు.

TPCC Working President Jaggareddy Comments , Agneepath , Sangareddy District ,

అగ్నిపథ్ పథకం తో ఉన్న ఉద్యోగాలు పోయే విధంగా ఉంది.దేశమంత ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఆర్మీ ని ప్రైవేట్ చేసే కుట్రలో భాగమే అగ్నిపత్ పథకం .సోనియా, రాహుల్ గాంధీ ల పిలుపు మేరకు సంగారెడ్డి లో సత్యాగ్రహ దీక్ష.నెహ్రు, ఇందిరా కాలం నుంచి జై జవాన్, జై కిసాన్ నినాదం.

Advertisement

కాంగ్రెస్ జవాన్, కిసాన్ పార్టీ, నాటి నుంచి నేటి వరకు అదే కాంగ్రెస్ నిర్ణయం సుభాష్ చంద్రబోస్ కు బీజేపీ కి సంబంధం లేదు.రాజకీయ లబ్ది కోసం ఆయన ఫొటో వాడుతున్నారు.

ఆర్మీ లో పని చేసిన వారికి రిటైరైతే భూమి ఇచ్చే వారు.ఆ విధానాలకు స్వస్తి చెప్పడం బీజేపీ విధానం.

ఆర్మీ లో ఉద్యోగాలు చేయాలనుకునే యువత ఆశలను ఆవిరి చేయొద్దు అగ్నిపథ్ ని కేంద్ర ప్రభుత్వం వేంటనే రద్దు చేయాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు