కేసీఆర్ ని క‌ల‌వ‌డానికి వ‌స్తే మేం క‌లిసేది లేదు.. య‌శ్వంత్ సిన్హా రాక‌పై రేవంత్ వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మంచి జోరు మీద ఉన్నారు.ఆయన ఆధ్వర్యంలో వరుస చేరికలతో కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ బలపడుతుండటమే దీనికి కారణం.

ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ నవనవోన్మేషంతో తొణికసలాడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా అన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధినేతలను కలసి మద్దతు కోరుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణకు వస్తున్నారు.

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు.ఆయనను కలసి రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించనున్నారు.

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ‌కు వ‌స్తుండ‌టంతో కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారితీశాయి.ఓ ప‌క్క బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి విచ్చేస్తుండ‌టం.

య‌శ్వంత్ సిన్హా రాక.కాంగ్రెస్ వైఖ‌రితో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ యశ్వంత్ సిన్హా రాకను స్వాగతిస్తూ భారీ ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప‌క్కాగా ప్లాన్ చేసుకుని బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాల స‌మ‌యంలో ఈ నిర్ణయం తీసుకోవ‌డం కీల‌కంగా మారింది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సంచ‌ల‌న రేపుతున్నాయి.యశ్వంత్ సిన్హా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయితే తాము క‌ల‌వ‌బోమ‌ని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.ముందు కేసీఆర్ ను కలిసినా, లేదా తమను కలిసిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ల‌ని కలవాలని చూసినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

యశ్వంత్ సిన్హాను తాము కలవబోమని తేల్చి చెప్పారు.ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద.ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదని తాను గతంలోనే చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.పైగా యశ్వంత్ సిన్హా కాంగ్రెస్ అభ్యర్థి కాదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు అడిగితేనే ఇచ్చామన్నారు.

అయితే యశ్వంత్ సిన్హా కేసీఆర్ ను , తమను కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.కాగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరడంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆయన తనకు మంచి మిత్రుడని అన్నారు.బీజేపీలో చేరుతున్నట్టు విశ్వేశ్వర్ రెడ్డి తనకు మాట మాత్రంగా కూడా చెప్పలేదన్నారు.

అలాంటప్పుడు నేను ఏం మాట్లాడ‌లేన‌ని అన్నారు.బీజేపీలో చేరినా ఆ పార్టీ విధానాలు నచ్చక ఆయన వెనక్కి వచ్చేస్తారనే ధీమ వ్య‌క్తం చేశారు.

తాజా వార్తలు