ఇసుక మాఫియాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

రాష్ట్రంలో ఇసుక మాఫియాపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కరీంనగర్ జిల్లాలోని తనుగుల ఇసుక క్వారీని పరిశీలించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఒకే పర్మిషన్ పై నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారని తెలిపారు.

ఇసుక మాఫియాలో కేసీఆర్ కుటుంబానికి భాగస్వామ్యం ఉందని విమర్శించారు.ఇసుక అక్రమ రవాణాతో మానేరు వాగు ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు.

అక్రమ ఇసుక క్వారీలను మూసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.కేసీఆర్ కుర్చీ కదులుతుందనే తమపై దాడులకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Advertisement
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable