పార్టీ క్యాడర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం

మునుగోడు ఉపఎన్నిక నేప‌థ్యంలో కాంగ్రెస్ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తున్నారు.ఈ క్ర‌మంలో పార్టీ నేత‌ల‌తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ చేప‌ట్టారు.

బీజేపీ, టీఆర్ఎస్ తీరును వ్య‌తిరేకిస్తూ.ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మం, ఉప ఎన్నిక నేప‌థ్యంలో నేత‌లు అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ క్యాడ‌ర్ కు దిశా నిర్దేశం చేశారు.

అనంత‌రం, మునుగోడు నియోజకవర్గంలో రాజీవ్ జయంతి వేడుకల నిర్వహణపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.దివంగత రాజీవ్ గాంధీ జయంతిని పుర‌స్క‌రించుకుని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాలు ఎగురవేసి ఆయ‌న చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించాలని సూచించారు.

అదేవిధంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవల గురించి ప్రజలకు వివరించాలని వివరించారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు