హీరోయిన్-డైరెక్టర్ల కాంబోలు మళ్లీ హిట్ కొట్టేనా?

హీరో- హీరోయిన్ కాంబినేషన్, హీరో- డైరెక్టర్ కాంబినేషన్ తో పాటే.డైరెక్టర్- హీరోయిన్ కాంబినేషన్ కూడా ఈ మధ్య టాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతోంది.

ఓ బ్యూటీతో రాపో పెరిగితే చాలా మళ్లీ తననే తదుపరి సినిమాల్లో తీసుకుంటున్నరు మూవీ మేకర్స్.హీరోయిన్లు సైతం తమకు సక్సెస్ ఇస్తున్న దర్శకుడితో చేసేందుకు ఎన్నిసార్లైనా సరే అంటున్నారు.

తాజాగా మరికొన్ని డైరెక్టర్- హీరోయిన్ కాంబినేషన్లు ముందుకు వచ్చాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రశ్మికా మందాన- వెంకీ కుడుముల

రశ్మికా మందానకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.ఈ హీరోయిన్ తో సినిమాలు చేసేందుకు దర్శకులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

Advertisement
Tollywood Heroine And Director Combination, Directors, Heroines, Combination, To

కానీ తనకు తొలి మూవీతోనే సక్సెస్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అయ్యిందట.వెంకీ కుడుముల, వరుణ్ తేజ్ కాంబోలో తాజాగా ఓ సినిమా రాబోతుంది.

త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీకి రశ్మికా మందానను హీరోయిన్ గా సెలక్ట్ చేశారట.వెంకితో కలిసి ఛలో, భీష్మ సినిమాలు చేసిన ఈ కన్నడ బ్యూటీ మరోసారి వెంకీ కుడుముల ఫిల్మ్‌ లో తన అందాలను ఆరబోయబోతుంది.

పూజా హెగ్డే – త్రివిక్రమ్

Tollywood Heroine And Director Combination, Directors, Heroines, Combination, To

ఈ కాంబోలో మంచి మూవీస్ వచ్చాయి.త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత, అల.వైకుంఠపురములో. సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ పొడుగుకాళ్ల సుందరి.

తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోయే మహేష్ బాబు మూవీలోనూ పూజా హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది.

కియారా- కొరటాల శివ

Tollywood Heroine And Director Combination, Directors, Heroines, Combination, To
టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా భరత్ అనే నేను.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆచార్యలో కూడా నటించాలని కియారాను కోరాడట శివ.కానీ తను బాలీవుడ్‌లో బిజీగా ఉండి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నో చెప్పిందట.నెక్ట్స్ మూవీలో మిస్ కాకుండా కియారాను ఫిక్స్ చేశాడట కొరటాల.

Advertisement

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో కియారానే ఎంపిక అయినట్లు టాక్ వినిపిస్తోంది.

తాజా వార్తలు