అన్నీ బాగున్నా.. చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయిన 10 సినిమాలు ఇవే?

సాధారణంగా ఇండస్ట్రీలో సినిమా బాగుంటే హిట్టవుతుందని భావిస్తూ ఉంటారు .కానీ కొన్ని సినిమాల విషయంలో ఇలాంటివి తారుమారు అవుతూ ఉంటాయి అని చెప్పాలి.

కథ బాగుంటుంది.స్టోరీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అబ్బా ఏముందిరా అని అనుకుంటాడు.కానీ ఎందుకో తీరా ఆ సినిమా కమర్షియల్గా హిట్ కాకపోవడంతో నిర్మాతలకు నష్టాలను తెచ్చి పెడుతూ ఉంటాయి.ఇక ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.

1.అంటే సుందరానికి :

నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రీయ హీరోయిన్ గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం అంటే సుందరానికి.ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

కొత్త కథని ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ.కానీ సినిమా నిర్మాతలకు మాత్రం నష్టాలు తప్పలేదు.

2.విరాట పర్వం :

సాయి పల్లవి రానా ప్రధాన పాత్రలో నటించిన విరాటపర్వం సినిమా నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది వేణు ఉడుగుల రొటీన్ కథని భిన్నంగా చూపించి ఆకట్టుకున్నాడు.కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

Advertisement

ఖలేజా :

ఒక సినిమా హిట్ అవ్వడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి.సినిమా చూసిన ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ అని అనుకుంటారు.ఇప్పటికీ ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అన్నది మాత్రం ప్రేక్షకులకు తెలియని ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది.

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది అనే విషయం తెలిసిందే.

వేదం :

వేదం చూసిన ప్రేక్షకుడిని అడిగితే అది ఒక ఫీల్ గుడ్ మూవీ.ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అని చెబుతారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు మాత్రం హిట్ ఇవ్వలేక పోయారు.దీంతో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది ఈ మాస్టర్ పీస్ వేదం సినిమా.

అ :

సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసింది అని చెప్పాలి.ఇక ఎంతో ప్రయోగాత్మకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది అని చెప్పాలి.

ఈ నగరానికి ఏమైంది :

ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.సినిమా చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇందులోని పాత్రలు కనెక్ట్ అవుతాయి.ఇక ఇలా అన్నీ బాగున్నా ఈ సినిమా మాత్రం హిట్ కాలేదు.

Advertisement

డియర్ కామ్రేడ్ :

సరికొత్త కథాంశం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు దర్శకుడు.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన నటించారు.కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు అని చెప్పాలి.

జానీ :

పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ సినిమా ఎంతో మందిని ఆకట్టుకుంది.కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

నేనొక్కడినే

: సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేసింది.ప్రేక్షకులకు సినిమా అర్థమయ్యే లోపే చివరికి డిజాస్టర్గా మిగిలిపోయింది.

జగడం : బ్లాక్ బస్టర్ కావడానికి ఉండాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.సుకుమార్ మేకింగ్ లో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు మాత్రం అంతగా ఆదరించ లేదు అని చెప్పాలి.

తాజా వార్తలు