ఏప్రిల్‌ కోసం కొట్టుకుంటున్న యంగ్‌ హీరోలు

టాలీవుడ్‌ సినిమాలకు సమ్మర్‌ ప్రారంభం అయ్యింది అంటే సందడే సందడి.ప్రేక్షకులకు జాతరే జాతర.

వరుసగా చిత్రాలు వస్తాయి.గత ఏడాది అంతకు ముందు ఏడాది పెద్ద సినిమాల సందడి ఉంటే ఈసారి మాత్రం చిన్న హీరోలు, కొత్త హీరోల జోరు కనిపిస్తుంది.

మార్చి చివరి వారం నుండే సమ్మర్‌ సమరంకు అంతా రెడీ అవుతున్నారు.మార్చి చివరి వారంలో నాని ‘వి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ఏప్రిల్‌లో ఎన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయో లెక్క పత్రం లేకుండా ఉంది.

Advertisement

ఏప్రిల్‌ మొదటి వారంలోనే నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది.అందులో రెండు అధికారిక ప్రకటన వచ్చాయి.రెండు మాత్రం ఇంకా అధికారికంగా రాలేదు కాని అదే తేదీ అంటున్నారు.

ఇక ఆ తర్వాత వారాల్లో కూడా అదే జోరు కంటిన్యూ అవ్వబోతుంది.మొత్తానికి ఏప్రిల్‌ నెల మొత్తం కలిపి 15 నుండి 20 చిత్రాలు చిన్నవి మరీ చిన్నవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

అందులో ముఖ్యమైన సినిమాలు ఇప్పుడు చూద్దాం.నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌ స్టోరీ’, మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’, రానా హీరోగా నటించిన ‘అరణ్య’, రాజ్‌ తరుణ్‌ నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’, విశ్వక్‌సేన్‌ ‘రెడ్‌’ ఇంకా మాస్టర్‌, 83, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, శ్రీకారం చిత్రాలు విడుదల కాబోతున్నాయి.ఇవి కాకుండా ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా ఏప్రిల్‌లోనే వచ్చేద్దామని వెయిట్‌ చేస్తున్నాయి.

మరి ఈచిత్రాల్లో ఏది నిలిచేనో చూడాలి.

Advertisement