సీనియర్ స్టార్ హీరోలు ఆ విషయంలో మారిపోయారా.. ఆ మార్పు మంచికేనా?

చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరికి సినిమా చేయాలంటే కథలను ఎంపిక చేసుకోవాల్సిందే.

అయితే ఈ కథల ఎంపికల విషయంలో ఒక్కో హీరో ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతారు.

వారి బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే విధంగా అలాగే వారికీ అభిరుచికి తగ్గట్టుగా కథలను ఎంచుకుంటారు.ఇలా ఒక్కో హీరో ఒక్కో కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు.

అయితే టాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం కథల విషయంలో చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు.మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు తమ ఏజ్ కు తగ్గట్టుగా కథలను సెట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు.

మన టాలీవుడ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు కూడా పోటీగా నిలుస్తున్నారు.

Advertisement

ఈ నలుగురు హీరోలు వారి ఏజ్ కు తగ్గ డిఫెరెంట్ కథలను ఎంపిక చేసుకుని హిట్ అందుకుంటున్నారు.మెగాస్టార్ కమర్షియల్ ఫార్మాట్ లో కథలను ఎంచుకుంటున్నాడు.ఈ స్టోరీలు చిరుకు బాగా సెట్ అవుతున్నాయి.

ఇక నందమూరి బాలకృష్ణ కూడా కథల ఎంపిక బాగా చేస్తున్నాడు.ఈయన డ్యూయెల్ రోల్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వంటి పవర్ ఫుల్ ఫార్ములాను వాడుతున్నాడు.

ఇక నాగార్జున ఇంతకు ముందులా రొమాంటిక్ కథలను పూర్తిగా పక్కన పెట్టేసాడు.వాటికీ వదులుగా స్పై థ్రిల్లర్స్ ను ఎంపిక చేసుకుంటున్నాడు.అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఒకవైపు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూనే మరోవైపు సోలో హీరోగా కూడా మెప్పిస్తూ తనకు తగ్గ కథలను ఎంపిక చేసుకుంటున్నాడు.

ఇలా ఈ నలుగురు సీనియర్ హీరోలు తమకు తగ్గ కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ఈ మార్పు వల్లనే ఈ హీరోలు హిట్స్ అందుకుంటున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement