Tollywood Producers : ట్రాక్ తప్పుతున్న నిర్మాతల బిజినెస్ ప్లాన్..ఓవర్సీస్ లెక్కలు తేలడం లేదు

సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాయి టాలీవుడ్ చిత్రాలు.

ఒక సినిమా 100 కోట్లతో విడుదల చేసి 1000 కోట్ల లాభాలను అర్జిస్తే రెండో సినిమాకి 500 కోట్ల బడ్జెట్ పెట్టి 2000 కోట్లు ఆర్జించాలి అనే పద్ధతిలోనే ఒకదాని తర్వాత ఒక సినిమా వస్తోంది ఈ వ్యవస్థకు ఆజ్యం పోసిన మూలపురుషుడు రాజమౌళి( Rajamouli ) ఆయన బాహుబలి పుణ్యమా అని ఈరోజు సినిమా బడ్జెట్ అంతకంతకు పెరుగుతూ వెళ్తున్నాయి.

అయితే వాటిని వసూళ్లు చేసుకునే క్రమంలో నిర్మాతలు పూర్తిగా ట్రాక్ తప్పుతున్నారు.ఇంతకు ముందు నైజాం ఏరియాలో 40 కోట్ల వసూలు సాధిస్తే మహా గొప్ప సినిమా అన్నట్టు చూసారు.

కానీ బాహుబలి( Baahubali ) 70 కోట్లు,ఆర్ఆర్ఆర్ 100 కోట్లు, మొన్నటికి మొన్న సలార్ సినిమా 70 కోట్ల వసూలు చేసి ఔరా అనిపించింది.

Tollywood Producers Are Not In Track

రాజమౌళి తీసుకుంటున్న సినిమాలకు ఆయనకు బాగానే వర్కౌట్ అవుతుంది కానీ అందరికీ అలా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ లేదు.ఏదైనా ఒక సినిమా వస్తుంది అంటే నిర్మాత తో పాటు బయ్యర్ కూడా బాగుపడాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది.డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక రేట్ చెప్పి అమ్ముకుంటే సరిపోదు.

Advertisement
Tollywood Producers Are Not In Track-Tollywood Producers : ట్రాక్ �

ఇక ఇప్పుడు కల్కి, పుష్ప 2( Kalki, Pushpa 2 ) సినిమాల వంతు వచ్చింది.ఈ రెండు సినిమాల రేట్లు మండిపోతున్నాయి.అంతేకాదు ఓవర్సీస్ విషయానికి వచ్చేసరికి లెక్కలు తేలడం లేదు.

కేవలం ఓవర్సీస్ కోసమే 100 కోట్ల రూపాయలు చెబుతున్నారు నిర్మాతలు.ఆ డబ్బు పెట్టి సినిమా కొనుక్కుంటే ఆ తర్వాత లాభాలు వస్తాయో లేదో పక్కన పెడితే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.

Tollywood Producers Are Not In Track

అందుకే స్టార్ హీరోల సినిమాలైనా కూడా బడ్జెట్ విషయంలో ఆచితూచి అడగేస్తున్నారు బయర్లు.రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలకే ఈ పరిస్థితి ఉంది.ఇప్పటికైనా అందరూ ఒక అడుగు ముందుకేసి బడ్జెట్ తగ్గించి బయ్యర్ లను కాపాడాల్సిన అవసరం ఉంది.

మరి ముక్యముగా ట్రాక్ తప్పి ఖర్చు చేస్తూ ఆ రిటర్న్స్ బయ్యర్ల రూపంలో వసూల్ చేసుకోవాలని చూస్తునాను నిర్మాతల ధోరణి మారాలి.కొన్ని సార్లు మొత్తం మునిగిపోతున్న బయ్యర్లకు ఊతం ఇవ్వాల్సిన అవసరం కూడా నిర్మాతలపై ఉంది.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు