టీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ప్రముఖ తెలుగు నిర్మాత... ఆయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణమైన ఫలితాలను చవి చూసింది.

తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం మంది తెలుగు దేశం పార్టీకి మద్దతు దారులు ఉంటారనే టాక్‌ ఉంది.

హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీకి తిరుగు లేదు అంటూ అంతా భావించారు.కాని అనూహ్యంగా హైదరాబాద్‌ ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారు.

అద్బుతమైన మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు.ఈ ఎన్నికల్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత దారుణమైన పరాజయం పాలయ్యాడు.

తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసిన ఆయన కుదేలయ్యాడు.

Advertisement

భవ్య క్రియేషన్స్‌పై చాలా సినిమాలు నిర్మించి ప్రేక్షకులను అలరించిన భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ ఈమద్య కాలంలో సినీ పరిశ్రమలో కూడా పెద్దగా సక్సెస్‌లు అందుకోలేక పోయాడు.వ్యాపారంలో భారీ లాభాలను దక్కించుకున్న ఆనంద్‌ ప్రసాద్‌ సినిమాల్లో సరదాగా కోట్లు ఖర్చు చేస్తూ వచ్చాడు.

ఇప్పుడు బాలయ్య అండ దండలతో హైదరాబాద్‌ శేరిలింగంపల్లి టికెట్‌ను దక్కించుకున్నాడు.తెలుగు దేశం పార్టీకి కంచు కోట అంటూ పేరున్న ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం ఈ నిర్మాత దాదాపుగా 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

రియల్టర్‌ అయిన భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ భారీగా ఖర్చు చేసినా కూడా కారు జోరు ముందు నిలువలేక పోయాడు.ఒక వైపు సినిమాలు ఫ్లాప్‌ అవుతున్న సమయంలో భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.కాని అక్కడ కూడా దారుణమైన పరాజయం పాలయ్యాడు.30 కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తే కొంత మొత్తంలో అయినా వచేవి.కాని ఈసారి ఒక్క పైసా కూడా వెనక్కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

టీ ఎన్నికల్లో సినీ పరిశ్రమ నుండి పోటీ చేసింది ఈయన ఒక్కడే.ఈయన దారుణ పరాజయం పాలయ్యాడు.

మీ దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ముత్యాల్లా మెరుస్తాయి!
Advertisement

తాజా వార్తలు