మామూలుగా ఎవరైనా రాజకీయ నాయకుడికి లేదా గవర్నమెంట్ ఆఫీసులలో రిక్వెస్ట్ పెడుతూ పేపర్లు సమర్పిస్తే అవి బుట్ట దాఖలవడం మనం చూస్తూనే ఉంటాం.
అలాగే ఇప్పుడంటే నవలలు, రచనలు పత్రికా ఆఫీసులకు పంపించడం తగ్గిపోయింది కానీ గతంలో ప్రతి రచయిత అడ్రస్ తో సహా తన రచన పంపించేవారు.
సదరు పత్రిక ఎడిటర్ కు నచ్చితే అది ఆ పత్రికలో అచ్చు అయ్యేది.నచ్చకపోతే తిరుగు టపా లో వారికే చేరేది.
ఇలా అచ్చు అయిన తర్వాత చూసుకుని మురిసిపోయేవారు సదరు రచయితలు.దీనికి సంబంధించిన ఒక ఫన్నీ సంఘటన గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నటుడు మరియు రచయిత అయిన రావి కొండలరావు గురించి అందరికీ తెలిసిందే ఆయన తొలినాళ్ల నుంచి అనేక నాటకాల్లో నటించారు అంతేకాదు ఆయనకు రచయితగా మంచి పేరు ఉంది.రావి కొండల రావు గారు యువకుడిగా ఉన్న సమయంలో ఔత్సాహిక రచయితగా ఆయన రచనలను ఎన్నో పత్రికలకు పంపించేవారు.
అలా ప్రధాన పత్రిక ఆయన రాసిన రచనను ఎల్లప్పుడూ తిప్పి తిరుగు టపాలో పంపించేవారట.ఆయన మనసు నోచుకున్నా సరే మళ్లీ మళ్లీ కొత్తగా రాసి ఆ పత్రిక సంస్థకు పోస్ట్ చేసేవారట.
అలా పంతం పెరిగిపోయి మళ్లీ మళ్లీ పంపుతున్న సదరు పత్రిక తిరిగి ఆయన రచనను తిరిగి పంపించడం పట్ల బాగా విసిగిపోయారట కొండల రావు గారు.ఇలా పలుమార్లు పోస్ట్ ఇంటికి రావడం వల్ల చార్జెస్ కూడా పడేట అప్పట్లో.విసిగిపోయిన రావి కొండల రావు గారు చివరిసారిగా ఒక రచన పంపించి అలాగే తిప్పి పంపడానికి వీలుగా తన అడ్రస్ ను కూడా జోడించి పంపించారట.
షరా మామూలుగా ఆ రచన తిరిగి ఇంటికి వచ్చింది.అప్పుడు ఎంతో సంబరపడిన కొండల రావు గారు ఎడిటర్ కి ఒక ఉత్తరం రాసారట.నేను ఎన్నిసార్లు రచనలు పంపిస్తున్న అవి తిరిగి వస్తుంటే నా రచనల్లో ఏదో పొరపాటు ఉందని అనుకున్నాను
కానీ చివరిసారిగా మీకు చలం గారు రాసిన ఒక కథను నా దస్తూరి తో పంపిస్తే దానిని కూడా మీరు తిప్పి పంపించారు అంటే నాలో ఏ పొరపాటు లేదు అని అర్థమయింది అని, ఇక మీ పత్రికకు సెలవు నేను వేరే పత్రికలకు రాసుకుంటాను అని చెప్పారట.ఈ విషయాన్ని ఆ పత్రిక ఎడిటర్ చదివి బుట్ట దాకలు చేయకుండా తమ పత్రికలో జరిగిన సంఘటనగా రచయిత పేరుతో సహా ముద్రించడంతో అప్పట్లో ఇది వైరల్ గా మారింది.అలా తిరుగు టపా స్థాయి నుంచి పోస్టల్ స్టాంప్ గా ఆయన ఫోటో వచ్చే స్థాయి వరకు రావి కొండల రావు గారు ఎదిగారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy