ఇప్పటి వరకు ఒక లెక్క.ఇక నుంచి మరో లెక్క అంటున్నారు కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు.
లోకల్ స్టార్స్ గానే మిగిలిపోయి పాన్ ఇండియా అంటే ఏంటో తెలియకుండా జీవితం వెల్లదీస్తున్నారు.కానీ వీరికి ముందు వచ్చిన వారు తర్వాత వచ్చిన వారు కూడా పాన్ ఇండియా జపం చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ కెరియర్లో 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమయంలో కొంతమంది హీరోలు మాత్రం తెలుగులోనే ఉంటాము అంటూ నిన్న మొన్నటి వరకు గిరిగీసుకుని కూర్చున్నారు.
కానీ లెక్కలు మారుతున్నాయి.వారికి కూడా పాన్ ఇండియా సినిమా కావాలని వారి దర్శక నిర్మాతలు నూరి పోస్తున్నారు.
దాంతో ఖచ్చితంగా 2024లో పాన్ ఇండియా సినిమా తీసి పనిలో పడ్డారు.మేము కూడా మిగతా స్టార్ హీరోలు లాగానే పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకునే ప్రయత్నం చేయబోతున్నారు.
ఇంతకి ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్స్ గా అవతారమెత్తాలని ప్రయత్నిస్తున్న ఆ హీరోలు ఎవరు ? ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
( Mahesh Babu ) చాలా రోజులుగా బాలీవుడ్ నుంచి పిలుపు వస్తున్న ఏమాత్రం చెల్లించకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన హీరో మహేష్ బాబు కానీ రాజమౌళి పుణ్యమా అని తెలుగులోనే సినిమా తీస్తూ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగే అవకాశం ఆయనకు వచ్చింది ఇప్పటివరకు ఒక్క ప్యాన్ ఇండియా సినిమా తీయకపోయినా ఇప్పుడు ఆయన తీయబోయే సినిమాతో అందరి లెక్కలు సరి చేయనున్నారు .రాజమౌళి , మహేష్ బాబు( Rajamouli, Mahesh Babu ) కాంబినేషన్ కోసం చాలా రోజులుగా వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు.వారి కళలను నిజం చేస్తూ ఇప్పుడు మహేష్ బాబు కొత్త సినిమా రాజమౌళితో 2024 లోనే ప్రారంభం కాబోతోంది.
దీంతో పాన్ ఇండియా మొట్టమొదటి సినిమాగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా ఉండబోతోంది.
( Pawan Kalyan ) ఇక పవన్ కళ్యాణ్ సైతం లోకల్ లో చాలా స్ట్రాంగ్ హీరో కానీ ఫ్యాన్ ఇండియా సినిమా ఇప్పటి వరకు తీయలేదు.ఆయన కన్నా వయసులో చిన్న హీరోలు సైతం వందల కోట్లు బడ్జెట్ తో వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు.కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ఊసే ఎత్తలేదు.
ఇక డైరెక్టర్ క్రిష్ , హరి హర వీరమల్లు ( Director Krish, Hari Hara Veeramallu )సినిమాతో మొట్టమొదటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇండియా సినిమా అంటూ ఊదరగొట్టిన అది ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.ఈలోగా ఓజి ( OG )చిత్రాన్ని సుజిత్ సినిమాగా తీయబోతున్నాడు.
ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్ ఇండియా హీరోగా చూడాలని ఆయన ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy