ఇక స్టార్ హీరో ల కాలం చెల్లింది... స్టార్ సినిమాలు మాత్రమే వచ్చాయి.

ఒకప్పుడు సినిమా స్టార్స్ ఉండేవాళ్ళు.స్టార్ హీరోలు ఉండేవారు కానీ ఇప్పుడు ఈ ఉనికి ప్రశ్నార్ధకం అయింది.

ఈ విషయాన్ని రాజమౌళి లాంటి వ్యక్తి కూడా చెప్పడం విశేషం.స్టార్ హీరోలు ఎందుకు చచ్చిపోయారు.

కొన్నేళ్ల క్రితం నాగయ్య అనే సూపర్ స్టార్ ఉండేవారు.నిజానికి తెలుగు తెరమీద ఆయనే మొదటి స్టార్ హీరో.

ఆయన ఆ పక్షి రాజా వారి బీదల పాట్లు అనే ఒక సినిమా కోసం ఏకంగా లక్ష రూపాయల పారితోషకం తీసుకొని సంచలనంగా మారారు.ఆ తర్వాత ఆయన తీసిన త్యాగయ్య సినిమా ఆయనకు ఎంతో అభిమానాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

Advertisement

ఆయన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు స్టార్ హీరోగా అవతరించారు.ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలు గుర్రం వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆయన సూపర్ స్టార్ గా కూడా ఎదిగారు.

పాతాళ భైరవి సినిమాలో కూడా మొదట అక్కినేని హీరో అనుకున్న అది ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది.అక్కినేని తర్వాత ఎన్టీఆర్ పాతాళభైరవి సినిమాతో సూపర్ స్టార్ అయ్యారు.

జానపదాలు అక్కినేని తీస్తే, మిగతా సినిమాలో ఎన్టీఆర్ తీశాడు.అలా నాగయ్యకి, ఎన్టీఆర్, ఏఎన్నార్ కి మధ్య కొన్ని తేడాలున్న వీరందరూ ఒక్కొక్కరు ఒక్కో దశలో స్టార్ హీరోలుగా అవతరించి థియేటర్లను క్రౌడ్ తో నింపారు.

ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళగానే ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేసింది పూర్తిగా చిరంజీవి అని చెప్పాలి.ఆయనే ఆయన సమయంలో చిరంజీవి తర్వాత చాలామంది హీరోలు ఉన్నా ఆ స్థాయికి ఇప్పుడు లేదు.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?

జనాలను తీసుకొచ్చే దమ్ము మన సినిమాల్లో కనిపించడం లేదు.ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా ఫ్యాన్స్ కూడా థియేటర్ కి వెళ్లట్లేదు.

Advertisement

సినిమా చూడాలంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సినిమా బాగుంటే కూడా సరిపోదు మహా అద్భుతంగా ఉంటేనే చూస్తున్నారు.

అలాంటి సమయంలోనే ఇల్లు వదిలి థియేటర్ కి వెళ్తున్నారు లేదంటే OTT తోనే సరి పెట్టేస్తున్నారు.

పైగా థియేటర్స్ కూడా ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండకపోవడం మరొక కారణం.ఆచార్య సినిమా ఫలితం ఏంటో చిరంజీవికి బోధపడిన తర్వాత గార్ ఫాదర్ లో ఎలాంటి నెగటివ్ లేకపోయినా కూడా జనాలు థియేటర్ కి రాలేదు.ఇక స్టార్ హీరో తీస్తేనే థియేటర్ కి జనాలు వెళ్తారు అనుకోవడం ఇప్పటినుంచి పొరపాటు అవుతుంది.

నిన్న ఈ మధ్య నిఖిల్ కార్తికేయ సీక్వెల్ సినిమా హిందీ మార్కెట్ కి కనెక్ట్ అవ్వడంతో వందల కోట్లు వసూలు చేసిన ఇక్కడ గాడ్ ఫాదర్ సినిమా 10 కోట్లు వసూలు చేయడం కష్టంగా మారింది.ప్రతి శుక్రవారం హీరోల జాతకాలు మారిపోయే రోజులు వచ్చాయి.

ఎవరు హీరో అవుతారు ఎవరు డమాల్ అంటారు తెలీదు.నిజానికి ఇది మంచి పరిణామమే చక్కటి సినిమాలు మాత్రమే గుర్తింపు పొందుతాయి.

కానీ సినిమా పరిశ్రమ బాగుండాలంటే మాత్రం ఈ పరిణామం మంచిది కాదనే చెప్పాలి.

తాజా వార్తలు