ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరోల పిల్లలు సినిమాల కోసం మేకోవర్ అవుతున్నారు

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనే కల్చర్ ఎప్పటినుంచో ఉంది.ఎందుకంటే ఆ ఒక్కటే వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది.

ఆ తర్వాత ఎలాగూ టాలెంట్ ఉన్నవారే నెగ్గుకొని బయటకు వస్తారు.స్టార్స్ గా నిలబడతారు అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది హీరోల పిల్లలు తమ వారసత్వాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.వారిని వారు మేకోవర్ చేసుకుంటున్నారు.

ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో పిల్లలు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

చాలా రోజులుగా బాలకృష్ణ( Balakrishna ) కొడుకు మోక్షజ్ఞ( Mokshagna ) ఎంట్రీ ఉంటుంది అని ఊదరగొడుతున్న 30ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు హీరో ఎంటి భయ్య అనే వారు కూడా లేకపోలేదు.అయితే బాలకృష్ణ కొడుకు సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తాడు కానీ ఇక హీరో అయ్యే లక్షణాలు మాత్రం అతనికి ఏ మాత్రం లేవు.వెంకటేష్ కుమారుడు( Venkatesh Son ) సైతం అతి త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవబోతాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

తన అక్కల పెళ్లిల్లో కాస్త మొహం చూపించిన వెంకటేష్ కొడుకు మంచి హైట్ ఉండి అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈమధ్య నందమూరి జానకిరామ్( Nandamuri Janakiram ) కొడుకుని వైవిఎస్ చౌదరి( YVS Chowdary ) ఇంట్రడ్యూస్ చేయబోతున్న విషయం మనందరికీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కొడుకు అకీరా నందన్( Akira Nandan ) సినిమా ఇండస్ట్రీకి రాడు అని రేణు దేశాయ్ చాలాసార్లు చెబుతున్నప్పటికీ అతడు లండన్ లో సినిమా కోర్సులు నేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది.ఇక రవితేజ కుమారుడి సంగతి చెప్పవలసిన అవసరం లేదు తండ్రి కన్నా కూడా ఎంతో ఎనర్జీతో తండ్రిని మించి స్టార్ అవుతాడని ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్లో మాటలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి వాళ్ళ పిల్లలు చిన్న వారే కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవడం అనవసరం.మరోవైపు మహేష్ బాబు కొడుకుకి( Mahesh Babu Son ) సినిమా ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందో లేదో తెలియదు కానీ కుమార్తె సితార కు మాత్రం గట్టిగా ఉంది.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

అందుకే ఆమె డాన్స్ లో శిక్షణ తీసుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు