కుర్ర హీరోయిన్లను మించి దూసుకెళ్తున్న సీనియర్ నటీమణులు

వయసుతో సంబంధం లేకుండా.టాలీవుడ్.

కోలీవుడ్ అనే హద్దులు లేకుండా.

అన్ని సినిమా పరిశ్రమల్లో దూసుకెళ్తున్నారు అందాల ముద్దుగుమ్మలు.

యంగ్ హీరోయిన్లు రష్మిక, పూజా హెగ్డేనే కాదు.నయన్ నుంచి రకుల్ వరకు సీనియర్ నటులతో పాటు కుర్రకారుతో రొమాన్స్ చేస్తూ వరస అవకాశాలు దక్కించుకుంటున్నారు.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దుమ్ము రేపుతున్నారు.వరుస సినిమాలు చేస్తూ దుమ్మురేపుతుంది లేడీ సూపర్ స్టార్ నయనతార.

Advertisement

వయసు పెరుగుతున్నా.వరుస అవకాశాలతో ముందుకు సాగుతుంది.

కొత్త అమ్మాయిలకు అందని  వన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే ఈ అమ్మడు.

తెలుగు, మలయాళ సినిమాలూ కూడా చేస్తుంది.ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తుంది.బాలీవుడ్ లోకి షారుఖ్ సినిమాతో అడుగు పెడుతుంది.

సమంతా కూడా విడాకుల తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.వచ్చిన ఆఫర్లు కాదనడం లేదు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేస్తుంది.పుష్ఫ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది.

Advertisement

తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా చేస్తుంది.అప్పుడప్పుడు  టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది.

తెలుగులో మిషన్ ఇంపాజిబుల్, తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.మూడు భాషల్లో మంచి ఆదరణ దక్కించుకున్న నటిగా పేరు సంపాదించుకుంది.

అటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దూసుకెళ్తుంది.ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీ అయ్యింది.

తెలుగు, తమిళ సినిమాలు కూడా చేస్తుంది.అటు రాశీ ఖన్నా సైతం వరుస సినిమాలతో ముందుకు సాగుతుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది.అటు టాలీవుడ్లో కమర్షియల్ సినిమాల్లో చేస్తుంది.

తమిళంలో ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తుంది.అవకాశం వచ్చిన ఏ సినిమాలను వదులుకోవడం లేదు.

వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది.సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.

తాజా వార్తలు