ఓకే హీరోతో ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్ వీరే !

మామూలుగా హిట్ కాంబినేషన్ కి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంటుంది.

ఒక సినిమా హిట్ అయింది అంటే అందులో నటించడం నటీనటులకు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది అని అందరూ అంటుంటారు.

అలాంటి కాంబినేషన్ తో మళ్ళీ సినిమా వస్తే దానికి బాగా వచ్చి మార్కెట్ లో మంచి ప్రమోషన్ కూడా దొరుకుతుంది.ఇది ఇప్పటి తరం మాట మాత్రమే కాదు నాటి నుంచి నేటి వరకు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నది ఇదే.కేవలం హిట్ కాంబినేషన్స్ కోసం డైరెక్టర్ ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు.దానివల్ల సినిమాకి కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది.

ఆల్రెడీ వారికి కెమిస్ట్రీ బాగా కుదురుతుంది కాబట్టి ఎక్కువగా డైరెక్టర్ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒకే హీరోతో ఎక్కువ సార్లు నటిస్తున్న హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నయన తార( Nayanthara ) మరియు అజిత్( Ajith ) కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి.ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది.కోలీవుడ్ లో ఇదొక అద్భుతమైన హిట్ కాంబినేషన్ అని అందరూ అంటూ ఉంటారు.

Advertisement

ఇక టాలీవుడ్ లో సందీప్ కిషన్( Sundeep Kishan ) పరిచయం చేసిన రెజీనా( Regina ) అతనితోనే ఐదు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.భవిష్యత్తులో ఇంకా నటించే అవకాశం కూడా లేకపోలేదు.

చాలామంది ఈ సౌందర్య( Soundarya ) ఎక్కువగా వెంకటేష్ తో సినిమాలు తీసింది అనుకుంటారు.కానీ ఆమె జగపతి బాబు తో ఎక్కువ సినిమాల్లో నటించింది.

దాదాపు పది సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి.

సమంత( Samantha ) మరియు నాగచైతన్య( Nagachaitanya ) మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది వీరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వచ్చాయి.ఏ మాయ చేసావే సినిమా నుంచి మజిలీ వరకు వీరి కాంబినేషన్ లో నాలుగు చిత్రాలు వచ్చాయి.కానీ ఇకపై వీరు నటించే అవకాశాలు లేదు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఇప్పుడు మనం తీసుకున్న హీరోయిన్స్ అంతా కూడా ఈతరం ప్రేక్షకులను ఎక్కువగా అలరించినవారు గతంలో సావిత్రి, భానుమతి, జమున వంటి స్టార్ హీరోయిన్స్ ఒకే హీరోతో డజన్ల కొద్ది సినిమాలు తీసేవారు.అందుకే నాటి నుంచి ఇప్పటి వరకు ఈ హిట్ కాంబినేషన్ అనే పదానికి సినిమా పరిశ్రమలో మంచి విలువ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు