Tollywood Heroines: సూపర్ హిట్లు సాధిస్తున్నా ఈ హీరోయిన్లని వదలని దరిద్రం.. వారు ఎవరంటే..

సినిమా పరిశ్రమ ఎలా వర్క్ అవుతుందో ఎవరూ ఊహించలేరు.

కొన్ని సార్లు వరుస విజయాల తర్వాత కూడా నటీనటులకు మంచి అవకాశాలు రావంటే అది ఎంత కంప్లికేటెడ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది.ఒక సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరోకే చెందుతుంది.

కానీ సినిమా ఫ్లాప్ అయితే ఆ తప్పు అంతా హీరోయిన్ దే అవుతుంది.టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు సాధించిన కొందరు హీరోయిన్ల ప్రస్తుత పరిస్థితి ఇదే.ఉదాహరణకు, KGF సినిమాల్లో నటించిన శ్రీనిధి శెట్టి( Srinidhi Shetty ) ఇప్పుడు పాన్-ఇండియా స్టార్.అయితే కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ప్రాజెక్ట్స్ ఏమీ రాలేదు.

కేజీఎఫ్ రెండు పార్ట్స్ లో ఈ ముద్దుగుమ్మ చాలా బాగా నటించింది.అయినా కూడా ఆమెను ఇప్పుడు ఏ ఒక్క సినిమా ఆఫర్ వరించకపోవడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

Advertisement

ఇక ప్రగ్యా జైస్వాల్( Pragya Jaiswal ) కూడా కంచె సినిమాతో సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టింది.అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు.ఎట్టకేలకు అఖండతో హిట్ కొట్టిన ఆమెకు ఇప్పటికీ స్టార్ హీరోలతో నటించే ఆఫర్లు రావడం లేదు.

అది ఆమె దురదృష్టమనే చెప్పాలి.వరుస విజయాలతో దూసుకుపోతున్న మరో కథానాయిక సంయుక్తా మీనన్.

( Samyuktha Menon ) ఆమె భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలలో నటించింది.

ఈ సినిమాలన్నీ హిట్ అయ్యాయి, కానీ ఆమెకు ఇంకా పెద్ద ప్రాజెక్ట్ రాలేదు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మహానటి ఫేమ్ కీర్తి సురేష్,( Keerthy Suresh ) బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) రీసెంట్ టైంలోనే పెద్ద విజయాలు సాధించిన మరో ఇద్దరు నటీమణులు, కానీ ఇప్పటికీ వారికి సరైన ఆఫర్లు రాలేదు.టాలెంట్, బాక్సాఫీస్ అప్పీల్ ఉన్నా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టం ఉండాలని వీరి కెరీర్ లైఫ్ చూస్తుంటే అనిపిస్తుంది.ఈ నటీమణులు భారీ ప్రాజెక్టు ఇప్పుడు తమకు దొరుకుతాయా ఆశగా చూడక తప్పదు.

Advertisement

తాజా వార్తలు