పాపం ఆ హీరోయిన్.. ఎవరైనా అవకాశం ఇస్తే ఆ పెద్దల నుంచి ఫోన్?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కానీ, ఎక్కడైనా అవకాశాల కోసం కానీ కొంచెం పలుకుబడి ఉన్న వారి నుంచి, లేదా బాగా తెలిసిన వారి నుంచి అవకాశాల కోసం ఫోన్లు చేయిస్తూ ఉంటారు.

అయితే అలా చేయడం వల్ల వారికి కాస్త శ్రమ తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటారు.

అయితే సాధారణంగా అవకాశాలకోసం ఫోన్లు చేయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.కానీ ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఆ హీరోయిన్ కు వచ్చే అవకాశాలను తప్పించడం కోసం ఫోన్లు వస్తాయట.ఇది టాలీవుడ్ లో అవకాశాలు అందినట్టే అంది మిస్ అవుతున్న ఒక హీరోయిన్ వ్యవహారం.

టాలీవుడ్ లో ఒక పరభాషా హీరోయిన్ ఉంది.ఆమెకు తెలుగులో పలు రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి.

Advertisement

అయితే అంతా అయిపోయింది ఇక సినిమా మొదలు కానుంది అనుకుంటున్న సమయంలోనే ఆ సినిమా ఆ హీరోయిన్ చేతిలో నుంచి జారి పోతుంది.నిర్మాతలు, దర్శకులు చిన్న చిన్న కారణాలు చెప్పి హీరోయిన్ ని సినిమాలో నుంచి తప్పించేస్తున్నారు.

కానీ ఈ విషయం పై చాలా మంది ఆ హీరోయిన్ బ్యాడ్ లక్ వల్లే ఇదంతా జరుగుతుంది అని అనుకుంటున్నారు.కానీ అది అసలు విషయం కాదని, ఆ హీరోయిన్ ని సినిమాల్లో నుంచి తప్పించడానికి అసలు కారణం ఉందని తెలుస్తోంది.

సదరు హీరోయిన్ కి పక్క రాష్ట్రంలో నుంచి పెద్ద వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అయితే సదరు హీరోయిన్ సినిమాలు చేయడం ఆ పెద్ద వాళ్ళకు ఇష్టంలేదు.

దీంతో ఆ హీరోయిన్ హైదరాబాదులో దిగినప్పటి నుంచి అడుగడుగున ఫాలో అవుతూ ఎవరిని కలిసింది.ఎటు వెళ్తోంది.ఏమైనా సినిమా అవకాశాలు వచ్చాయా ఇలా ప్రతి ఒక్కటి ఆమె గురించి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఈ క్రమంలోనే ఎవరైనా సినిమాలో అవకాశం ఇస్తే సదరు దర్శకుడు నిర్మాతలకు వెంటనే ఫోన్ లు చేసి ఆ హీరోయిన్ ని సినిమాలనుంచి తీసేయమని చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు.సదరు దర్శక నిర్మాతలకు ఫోన్ చేసిన ఆ పెద్దలు ఏం చెప్తారు? ఏం చేస్తారో మీ ఇష్టం కానీ ఆ హీరోయిన్ మాత్రం నటించడానికి వీల్లేదు అని చెబుతారట.అలా ఆ హీరోయిన్ కు వచ్చిన అవకాశాలన్నీ కూడా అందినట్టే అంది చేజారిపోతున్నాయి.

Advertisement

గతంలో ఎన్నో అవకాశాలు, ప్రస్తుతం చేజారి పోతున్న అవకాశాలకు అసలు కారణం ఇదేనా.తాజాగా కూడా ఒక సినిమా అవకాశం రావడంతో నేరుగా ఆ దర్శకుడికి పెద్ద వాళ్ల నుంచి ఫోన్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.