బన్నీ అరెస్ట్ ముందూ వెనుక జరిగింది ఇదే.. ఈ వివాదం విషయంలో ట్విస్టులివే!

తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ( Pushpa 2 movie )గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.

అయితే ఈ పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ కు అభిమానులు భారీగా చేరుకున్నారు.

ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది.దీంతో ఈ ప్రమాదంలో అక్కడ ఒక మహిళ మృతి చెందింది.

అయితే ఈ విషాద ఘటన అల్లు అర్జున్ అలాగే మూవీ మేకర్స్ స్పందించిన విషయం తెలిసిందే.అయితే మహిళ మృతి పట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

అల్లు అర్జున్ పై కూడా కేసును నమోదు చేశారు.అయితే ఎట్టకేలకు తాజాగా అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
Tollywood Hero Allu Arjun Arrest, Tollywood, Allu Arjun, Arrest, Pushpa 2, Sandh

అల్లు అర్జున్ అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ( Chikkadapally Police Station )కు తరలించారు.

Tollywood Hero Allu Arjun Arrest, Tollywood, Allu Arjun, Arrest, Pushpa 2, Sandh

అయితే ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇస్తారా లేదంటే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారా అన్నది తెలియాల్సి ఉంది.అసలు ఈ కేసు కు ముందు వెనక ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే.పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ లో ప్రీమియర్ వేసారు.

అదే రోజు చాలా థియేటర్లలో ప్రీమియర్లు వేసారు.అటు సింగిల్ స్క్రీన్ లు, ఇటు మల్టీ ప్లెక్స్ లు.ఎక్కడా ఏమీ తొక్కిసలాట జరగలేదు.కానీ సంధ్య థియేటర్ దగ్గర మాత్రమే జరిగింది.

దానికి కారణం హీరో బన్నీ అక్కడకు రావడం.అది కూడా ఓపెన్ టాప్ జీప్ లో రావడం, బన్నీ వస్తున్నారని జనాలకు ముందే తెలియడం.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఇక్కడ రెండు పాయింట్లు.

Tollywood Hero Allu Arjun Arrest, Tollywood, Allu Arjun, Arrest, Pushpa 2, Sandh
Advertisement

బన్నీ అక్కడకు వస్తున్నారని ముందే తెలిసింది కనుక, థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చిందా లేదా? బన్నీ రాకకు అనుమతి ఇచ్చి, బందోబస్త్ చేసి వుంటే ఇక ఎవరి తప్పు లేదు.అటు థియేటరు తప్పిదం లేదు.ఇటు బన్నీ తప్పిదం లేదు.

కానీ అలా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా, కోరకుండా వుండి వుంటే ఇటు థియేటర్ ది, అటు బన్నీ ది తప్పు అవుతుంది.ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది, తమకేమీ సంబంధం లేదని చెప్పింది.

ఆ మేరకు తన వాదన వినిపిస్తోంది.ఇప్పుడు అల్లు అర్జున్ కోర్టులో తన వాదన చెప్పాల్సి వుంది.

పోలీసులు అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారని తెలుస్తోంది.అంటే మరి వీటికి స్టేషన్ బెయిల్ ఇస్తారో ఇవ్వరో చూడాలి మరి.

తాజా వార్తలు