vijay devarakonda, prabhas : ఒకేసారి డబల్ గేమ్ ఆడుతన్న తెలుగు హీరోలు..హిట్స్ కోసం తిప్పలు

ఒకేసారి కేవలం ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే కిక్కు ఏముంది చెప్పండి.ఒక్కసారి ఒకటికి మించి సినిమాలతో వస్తేనే కదా అసలు మజా.

ఆలా టాలీవుడ్ లో ఈ మధ్య ఒకేసారి డబల్ గేమ్ షురూ చేసి రెండు లేదా అంత కన్నా ఎక్కువ సినిమాల్లోనే హీరో నటిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగి పోతుంది.ఇలా ఒకేసారి రెండు సినిమాలతో వస్తే వచ్చే లాభాల మాట ఏంటి అంటే ఖచ్చితంగా అభిమానులకు రెండు సినిమాలు ఒకేసారి వస్తే పండగ వాతావరణం ఉంటుంది, అలాగే ఒకటి పోయిన మరొక సినిమా గట్టెక్కించే అవకాశం ఉంటుంది.

ఆలా ప్రస్తుతం క్యాలికులేషన్ తో వస్తున్న హీరోలు ఎవరు, ఏ సినిమాలతో వస్తున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ప్రభాస్ఆదిపురుష్ సినిమా కంటే ముందే ఎక్కువ ప్రాజెక్ట్స్ పైన సంతకం చేసాడు ప్రభాస్, ప్రస్తుతం అటు ప్రాజెక్ట్ కె( Project K ), ఇటు మారుతీ సినిమా ఒకేసారి షూటింగ్ శరవేగంగా జరుగుపుకుంటున్నాయి.

పైగా ఆదిపురుష్ దెబ్బ కూడా గట్టిగానే తగిలింది మనోడికి.అందుకే ఈ సారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేస్తున్నారు.

Tollywood Heors Multiple Movie Shootings At A Time
Advertisement
Tollywood Heors Multiple Movie Shootings At A Time-Vijay Devarakonda, Prabhas :

విజయ్ దేవరకొండలైగర్ సినిమా ప్లాప్ తర్వాత కళ్ళు తెరిచాడు విజయ్.ప్రస్తుతం ఖుషి సినిమా( Khushi movie ) షూటింగ్ పూర్తవుతుండగానే, గౌతమ్ తిన్ననూరి సినిమాను పట్టాలెక్కించి విజయ్ దేవరకొండ, ఇప్పుడు పరశురామ్ సినిమాను సైతం లైన్ లో పెట్టాడు.ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుపుకుంటున్నాయి.

Tollywood Heors Multiple Movie Shootings At A Time

రవితేజరావణాసుర సినిమా( Ravanasura movie ) పరాజయం తో రవి తేజ కూడా మేల్కొన్నాడు.ప్రస్తుతం ఈగల్ సినిమాతో పాటు టైగర్ నాగేస్వర రావు సినిమాను ఒకేసారి పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.ఈ రెండు సినిమాలు కేవలం మూడు నెలల గ్యాప్ లో విడుదల అవ్వనున్నాయి.

నాగ చైతన్యకస్టడి సినిమా పరాజయం నాగ చైతన్య ఒక గుణపాఠం గా మారినట్టుంది.అందుకే చాల జాగ్రత్తగా అడుగులు వేస్తూ తనకు గతంలో హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ, చందు మొండేటి ( Shiva Nirvana, Chandu Mondeti )వంటి ఇద్దరు హిట్ దర్శకులకు అవకాశం ఇచ్చి ఒకేసారి సినిమా షూటింగ్ మొదలెట్టేసాడు.నితిన్కొన్ని రోజులుగా ప్లాప్స్ ఉన్న నితిన్( Nitin ) కూడా రెండు సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నాడు.

ఓవైపు వక్కంతం వంశీ తో సినిమా చేస్తూ మరోవైపు వెంకీ కుడుముల ను కూడా లైన్ లో పెట్టేసాడు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు