ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల అందరి చూపు ప్రభాస్ వైపే.. దెబ్బకు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ !

ఏదైనా బలమైన కథ మంచి స్క్రిప్ట్ సిద్ధమయ్యింది అంటే దానికి హీరోగా ఎవరిని అనుకుంటున్నారు ఏ అని ఏ దర్శకుడుని అడిగినా గత మూడు నాలుగు ఏళ్ల కాలంగా ప్రతి ఒక్కరూ ప్రభాస్( Prabhas ) పేరు మాత్రమే చెబుతున్నారు.

అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో సైతం బలమైన పాత్రలు చేయడానికి అంతగా ఉపయోగపడరు అని, పైగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో అయితే మార్కెట్ విషయంలో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అని సదరు దర్శకులు నమ్ముతున్నారు.నిర్మాతలు సైతం ప్రభాస్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు.

సినిమా ఏంటి? కథ ఏంటి ?దర్శకుడు ఎవరు ? అనే విషయాలను కన్ఫమ్ చేయకుండానే కోట్ల రూపాయలను ప్రభాస్ ఇంటి ముందు కుమ్మరించడానికి సైతం కొంతమంది నిర్మాతలు క్యూ కడుతున్నారు అంటే ఆయన రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్ తో సినిమా అంటే ఒక్కసారిగా దర్శకులకి వచ్చే అవకాశం ఉంది.నేషనల్ మీడియా సదరు దర్శకులపై ఫోకస్ చేస్తారు.అలాగే పాన్ ఇండియా( Pan India ) మార్కెట్లో వారికి స్థానం దొరుకుతుంది.

Advertisement

ఇంత లాభం ఉండగా మరో హీరో దొరకాలంటే కష్టం మరో హీరో పని చేయాలంటే దర్శకులకు చాలా కష్టంగా ఉంటుంది.కానీ ప్రభాస్ తో సినిమా తీయాలంటే మరో నాలుగైదు ఏళ్ల పాటు అందరూ వెయిట్ చేయాల్సిందే.

ఇప్పటికే స్పిరిట్,( Spirit ) రాజా సాబ్,( Rajasaab ) సలార్ 2,( Salaar 2 ) కల్కి 2,( Kalki 2 ) హను రాఘవపూడి చిత్రాలు పెండింగ్ లో ఉన్నాయి.ఈ సినిమాలన్నీ అయ్యేసరికి దాదాపు 5 ఏళ్ల సమయం పడుతుంది.

అందుకే ఎంత పెద్ద దర్శకుడు సినిమా తీస్తాను అంటూ ప్రభాస్ కోసం వచ్చినా కూడా కొన్నేళ్లపాటు ఆగమనే చెప్తున్నారు.అలా అయితే తప్ప ప్రభాస్ డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.సినిమా హిట్టు లేదా ఫట్టు అనే విషయంతో సంబంధం లేకుండానే ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది.

ఒక్కో సినిమాకి 150 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నాడు.ఇక ముందు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది.బాలీవుడ్ లో సైతం ప్రభాస్ ను ఢీకొట్టే హీరో ప్రస్తుతం లేడు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అలాగే బడ్జెట్ మినిమం 1000 కోట్లు ఉంటే తప్ప ప్రభాస్ నీ కదిలించే నిర్మాతలు ఆయన దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది.

Advertisement

తాజా వార్తలు