గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ( Director Ram Gopal Varma )గురించి మనందరికీ తెలిసిందే.

వర్మ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

సినిమా ఇండస్ట్రీలో జరిగే అంశాలతో పాటు రాజకీయ అంశాలపై స్పందిస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.ఇలా తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు వర్మ.

అందరికంటే భిన్నంగా తన అభిప్రాయాన్ని చెబుతుంటారు.ఏ విషయమైనా సరే తన మనసులో ఉన్నదే బయటికి చెప్పేస్తారు.

ఏ విషయాన్ని అయినా కుండలు వదల కొట్టినట్టుగా చెప్పిస్తూ ఉంటారు.అడల్ట్ విషయాలలో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు.

Advertisement

అందువల్లే ఆర్జీవీకి( RGV ) సంచలన దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు.ఇకపోతే తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ మూవీ( game changer movie ) పై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.తాజాగా ఒక టాలీవుడ్ మూవీ గేమ్ ఛేంజర్‌ పై తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్‌ ను ఉద్దేశించి ఆర్జీవీ పోస్ట్ పెట్టారు.గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్లు ఖర్చు చేస్తే ఈ లెక్కన రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ కు రూ.4500 కోట్లు అయి ఉంటుందని రాసుకొచ్చారు.అలా గేమ్ ఛేంజర్‌ కు మొదటి రోజు కలెక్షన్స్ రూ.186 కోట్లు వచ్చాయంటే అల్లు అర్జున్‌ పుష్ప 2 రూ.1860 కోట్లు రావాల్సిందని ట్విటర్‌ లో రాశారు.ఇక్కడ ఏదైనా నిజానికి కావాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే నిజమనేది నమ్మదగినదిగా ఉండాలి.

అబద్ధం చెప్పినా కూడా నమ్మేలా ఉండాలి అంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ గా మారింది.రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ తాజాగా విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే.తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే ఈ మూవీ వసూళ్లను ఉద్దేశించి రాం గోపాల్ వర్మ ‍ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు