కలిసున్నారా లేక విడిపోయారా తెలియని అయోమయంలో ఉన్న టాలీవుడ్ జంటలు ఇవే !

సినిమా వాళ్ళంటేనే విడాకులు చాల కామన్.ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడాకులు తీసుకొని మరొకరితో ప్రేమలో పడుతూ ఉంటారు.

ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.ఇప్పుడు మనం చూడబోయే సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ విడాకులు తీసుకోకుండానే తమ జీవితాన్ని ఒంటరిగా గడుపుతున్నారు.

వారు విడాకులు తీసుకున్నారా లేదా అని అనుమానం అభిమానులకు వదిలేసి వారి పర్సనల్ లైఫ్ ని బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అలాంటి వారెవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీజ - కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి గారాల పట్టి శ్రీజ రెండుసార్లు పెళ్లి చేసుకుంది మొదటి భర్తతో ఒక కూతురు పుట్టాక విడాకులు తీసుకొని మళ్ళీ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంది వీళ్లకు కూడా ఓ కుమార్తె పుట్టింది.

అయితే గత కొంతకాలంగా వీరు కలిసి ఉన్నారా లేక విడిపోయారా అని క్లారిటీ లేకుండా జనాలను తికమక పెడుతూ వారి పర్సనల్ లైఫ్ ని వారు ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

రమ్యకృష్ణ - కృష్ణవంశీ

ఈ స్టార్ కపుల్ కూడా గత కొన్నేళ్లుగా ఎవరికి వారే విడిగా ఉంటున్నారు.వీరికి విడాకులు అయిందా లేక అవసరాల నిమిత్తం విడిగా ఉంటున్నారా అనే క్లారిటీ మాత్రం ఎవ్వరికి లేదు రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా కృష్ణవంశీ హైదరాబాదులోనే ఉంటున్నాడు.

విజయశాంతి - శ్రీనివాస్

బాలకృష్ణ స్నేహితుడైన శ్రీనివాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది విజయశాంతి.అయితే వీరి పెళ్లి ఫోటో తప్ప ఇప్పటివరకు బయట ప్రపంచం వీరి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది.వారిద్దరికీ పిల్లలు లేరు అనే వార్త తప్ప మరే విషయము తెలియదు.

వీరు కలిసి ఉన్నారా విడిపోయారని క్లారిటీ కూడా ఎవరికి లేదు.చూశారు కదా ఈ టాలీవుడ్ జంటలు ప్రస్తుతం కలిసున్నారో విడిపోయారు అనే క్లారిటీ అయితే ప్రేక్షకులకు లేకపోయినా చివరికి వారికైన ఉందో లేదో తెలియాల్సి ఉంది.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు