అల్లు అర్జున్ అరెస్టుపై మాట మార్చిన టాలీవుడ్ కమెడియన్... భయపడుతున్నారా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్(Allu Arjun) తీవ్రస్థాయిలో వివాదంలో నిలుస్తున్నారు.

ఇక ఈ వివాదం కాస్త రోజుకు ఒక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని అభిమానులు సైతం కంగారుపడుతున్నారు.

ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ అరెస్టును(Allu Arjuns arrest) పూర్తిగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.అయితే ఇప్పుడు మేటర్ కాస్త సీరియస్ అవ్వడంతో ఏ సెలబ్రెటీ కూడా ఈ విషయం గురించి మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారు.

ఇలాంటి తరుణంలోనే ఓ టాలీవుడ్ కమెడియన్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాట మార్చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Comedian Rahul Ramakrishna Sensational Post On Allu Arjun Arrest ,allu Arjun, Ra

ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్న నటుడు రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) స్పందించారు.ఈతొక్కిసలాట ఘటనలో భాగంగా అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్ ని ఒక్కరి మీద నెట్టివేయడం కరెక్ట్ కాదు.ఎలాంటి సంఘటన జరిగినా చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ గా మారుతుంది.

Advertisement
Comedian Rahul Ramakrishna Sensational Post On Allu Arjun Arrest ,Allu Arjun, Ra

చిత్ర పరిశ్రమని బ్లేమ్ చేయడం సులభం.ప్రతి ఏడాది ఉత్సవాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో, పొలిటికల్ ర్యాలీల్లో తొక్కిసలాట జరిగి ఎంతోమంది మరణించిన వాటి గురించి పట్టించుకోరు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఘటన జరిగితే టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారంటూ అల్లు అర్జున్ అరెస్టును ఈయన పూర్తిగా తప్పు పట్టారు.

Comedian Rahul Ramakrishna Sensational Post On Allu Arjun Arrest ,allu Arjun, Ra

ఇక ఈ విషయం కాస్త సీరియస్ కావడంతో ఇతర సినిమా సెలబ్రిటీలు మౌనంగా ఉన్నారు.అయితే రాహుల్ రామకృష్ణ మాత్రం సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పందించారు.ఈ సంఘటనలో జరిగిన పరిణామాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు.

అందుకే గతంలో అలాంటి వ్యాఖ్యలు చేశాను.ఇప్పుడు నేను నా కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు దీన్ని బట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా వెనకడుగు వేస్తుందని ఇలా భయపడటం వల్లే మద్దతును కూడా ఉపసంహరించుకుంటున్నారని స్పష్టమవుతుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు