అవయవ దానం చేస్తామని మాట ఇచ్చిన సినిమా యాక్టర్స్ వీళ్లే..!

అవయవ దానం( Organ Donation ) చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడినట్లు అవుతుంది.

అన్ని గొప్ప దానాల్లో అవయవ దానం కూడా ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు.

ఆర్గాన్ డొనేషన్ వల్ల ఇతరులు ఎంతగా ప్రయోజనం పొందుతారో మాటల్లో చెప్పలేము.వీటి గురించి సినిమా యాక్టర్లు అవగాహన పెంచుతూ ఉంటారు.

అంతేకాదు వారు కూడా అవయవాలను డొనేట్ చేసి తమ అభిమానులను కూడా అలాగే చేయమని ప్రోత్సహిస్తారు.ఇండియన్ హీరోలు సైతం ఈ నిస్వార్థంగా అవయవాలు డొనేట్ చేస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

వారెవరో తెలుసుకుందాం.

• పునీత్ రాజ్‌కుమార్

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్( Puneeth Raj Kumar ) బతికున్న సమయంలో తన అయిస్ డొనేట్ చేస్తానని అంగీకరించారు.

Advertisement
Tollywood Celebs Who Promised For Organ Donation Details, Tollywood Celebrities,

దురదృష్టం కొద్దీ ఆయన చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయారు.అయితే కుటుంబ సభ్యులు ఈ హీరో కళ్లను డొనేట్ చేశారు.

దానివల్ల ఇతరులకు కంటి చూపు ప్రసాదించినట్లైంది.ఈ విషయం తెలిసిన లక్షలాదిమంది అభిమానులు తాము కూడా కళ్లను దానం చేస్తామని మాటిచ్చారు.

పునీత్ ని స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల వేల సంఖ్యలో కళ్లు కూడా కలెక్ట్ అయినట్లు డాక్టర్లు తెలిపారు.

Tollywood Celebs Who Promised For Organ Donation Details, Tollywood Celebrities,

• విశాల్

పందెంకోడి మూవీ హీరో విశాల్( Vishal ) తన బాడీ ఆర్గాన్స్ డొనేట్ చేస్తానని ఇంతకుముందే ప్రకటించారు.అలాగే అభిమానులను కూడా ఈ పని చేయమని ప్రోత్సహించారు.

Tollywood Celebs Who Promised For Organ Donation Details, Tollywood Celebrities,
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

• విజయ్ సేతుపతి

టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి( Vijay Sethupati ) ఒక మెడికల్ ఫెసిలిటీ ప్రారంభించడానికి వెళ్లినప్పుడు తన ఐస్ డొనేట్ చేస్తానని మాట ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

• ఆమీర్ ఖాన్

బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్( Aamir Khan ) 2014లో తన బాడీలోని అన్ని పార్ట్స్ డొనేట్ చేస్తానని ప్రకటించారు.

• విజయ్ దేవరకొండ, మాధవి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) అతని తల్లి మాధవి ఇద్దరూ కూడా అవయవ దానం చేస్తామని హామీ ఇచ్చారు.వీళ్లు మాత్రమే కాకుండా సూర్య, రజనీకాంత్, మాధవన్, కమల్ హాసన్, జగపతిబాబు లాంటి నటులు కూడా తమ్మ బాడీ పార్ట్స్ దానం చేస్తామని మాటిచ్చారు.ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వీరి వీరాభిమానులు కూడా అవయవ దానం చేస్తామని హామీ ఇచ్చారు.

సమయానికి ఆర్గాన్స్ దొరక్క, రోగులను కాపాడలేక వైద్యులు ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు ఎన్నో ప్రాణాలు వారి కళ్ళముందే పోతుంటే తట్టుకోలేకపోతున్నారు.ఇలాంటి పరిస్థితులను మార్చేయడానికి ఈ హీరోల ముందుకు రావడం నిజంగా ప్రశంసనీయం.

తాజా వార్తలు