Anand Vardhan Interview: ఇలా ఉంటుంది మన తెలుగు యాంకర్ల దుస్థితి .. బిత్తర మొహాలు వేస్తారు

ఈ మధ్య కాలంలో మీడియా పోకడ చాలా మారిపోయింది.ఇక యూట్యూబ్ మీడియా సంగతి చెప్పక్కర్లేదు.

ఏదైనా ఇంటర్వ్యూ చేయాలంటే ముందు బాగా రీసెర్చ్ చేయాలనే కనీస అవగాహనా ఉండటం లేదు.మొహానికి మేకప్ సరిగ్గా ఉందా లేదా తప్ప అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, అవతల వారు చెప్పే సమాధానం ఏంటి అనే కనీస జ్ఞానం కూడా ఉండటం లేదు.

ఇక ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ చూసాక ఇక తెలుగు మీడియా పై ఉన్న కాస్త నమ్మకం పోయేలా అనిపించింది.మనసంతా నువ్వే, ప్రియరాగాలు, శ్రీమంజునాథ, ప్రేమించుకుందాం రా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆనంద్ వర్ధన్( Anand Vardhan ) గుర్తున్నాడా ?ఈ అబ్బాయి ఈ మధ్యలో హీరో గా కూడా చేసినట్టు ఉన్నాడు.అయితే ఆనంద్ వర్మను ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ చేయగా, సదరు యాంకర్ మీ కుటుంబ నేపధ్యం ఏంటి అని అడిగితే అందుకు సమాధానంగా ఆనంద్ వర్మ తన తాత గారు పి బి శ్రీనివాస్ అని తెలిపాడు.

Tollywood Anchors And Their Knowledge Levels Anand Vardhan Interview

ఆ మాట విన్నాక అస్సలు యాంకర్ ( Anchor ) మొహం లో ఎలాంటి హావభావాలు లేవు.ఎందుకంటే పి బి శ్రీనివాస్( PB Srinivas ) అనే వ్యక్తి గొప్పతనం ఆ యాంకర్ కి తెలిసి చస్తేగా.యాంకర్ మోహంలో ఫీలింగ్స్ చూసాకా ఏమి తెలియదు అని అర్ధం చేసుకొని ఆనంద్ వర్ధన్ తన తాతగారు ఘంటసాల టైం లో మంచి గాయకుడు అని చెప్పగా, ఓహో అవునా అనే సమాధానం తప్ప యాంకర్ నుంచి మరొక ప్రశ్న లేదు.

Advertisement
Tollywood Anchors And Their Knowledge Levels Anand Vardhan Interview-Anand Vard

అయన సినిమాల్లో కూడా నటించాడు కదా అనే ఒక ఎడ్డి ప్రశ్న వేయగా, అందుకు ఆనంద్ లేదు అనే చెప్పాడు.

Tollywood Anchors And Their Knowledge Levels Anand Vardhan Interview

ఇక పి బి శ్రీనివాస్ గారి గురించి చాల మందికి తెలియదు.అయన ఒక లెజెండరీ సింగర్. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి యాంకర్స్ కి ఇష్టం ఉండదు, పైగా అంత కన్నా అడిగిన వారి ఎడ్డి వేషాలు జనాలకు అర్ధం అయిపోతాయి.

అయితే ఒక్క శ్రీనివాస్ గారు మాత్రమే కాదు ఘంటసాల, ఎస్పీబీ వంటి వారి మధ్యలో ఎంతో మంది సింగర్స్ గురించి ప్రపంచం తెలుసుకోవాలని అనుకోలేదు.ముందు ముందు కూడా తెలుసుకునే అవకాశం లేదు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు