డైరెక్ట‌ర్ + హీరో = హ్యాట్రిక్ ….. ఈ లిస్ట్ లో ఎంత మంది హీరోలు ఉన్నారు

దర్శకుడికి కథ ఎంత ముఖ్యమో,ఆ కథను నడిపించే హీరో కూడా అంతే ముఖ్యం.

ఒక దర్శకుడు ఆ హీరోతో చేసిన సినిమా భారీ విజయం సాధిస్తే ఆ తర్వాత కూడా అదే హీరోతో మరో సినిమా చేయాలనీ అనుకుంటాడు.

ఆలా తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు ఓకే హీరోతో ముచ్చటగా మూడు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుసుకుందాం.మొదటి డైరెక్టర్ త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అని అందరు అంటారు.

త్రివిక్రమ్ అల్లుఅర్జున్ తో హ్యాట్రిక్ సినిమాలు తీసి హిట్ కొట్టారు.మొదట జులాయి ఈ సినిమా వారిద్దరికీ మొదటిది ఇందులో బన్నీ-సోనూసూద్ మధ్య నడిపించిన మైండ్ గేమ్ అందరికి తెగ నచ్చడంతో జులాయి సినిమా మంచి విజయం సాధించింది.

అలాగే రెండో సినిమాగా సన్ ఆఫ్ సత్యమూర్తి రాగా ఇందులోని మాటలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకున్నాయి.మరియు రాజేంద్ర ప్రసాద్ నటన కూడా కొత్తగా ఉండడంతో ఈ సినిమా కూడా విజయం సాధించింది.

Advertisement
Tollywood Actors And Directors Hatrick Combination , Tollywood Actors And Direct

ఇక చివరగా గత సంవత్సరంలో విడుదలై సంక్రాంతి హిట్ గా నిలిచినా చిత్రం ఆలా వైకుంఠపురములో ఈ విధంగా మూడు సినిమాలతో బన్నీ-త్రివిక్రమ్ హ్యాట్రిక్ సాధించారు.

Tollywood Actors And Directors Hatrick Combination , Tollywood Actors And Direct

అదేవిధంగా రెండో డైరెక్టర్ చూస్తే రాజమౌళి.రాజమౌళి ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి మరియు యమదొంగ ఈ మూడు మంచి హిట్ అయ్యాయి.అలాగే ప్రభాస్ తో రాజమౌళి తీసిన ఛత్రపతి, బాహుబలి రెండు భాగాలూ కూడా మంచి విజయాలు సాధించాయి.

ఇక మూడో దర్శకుడు గురించి చూస్తే పూరి జగన్నాథ్, అప్పట్లో రవితేజ తో తీసిన సినిమాల వల్ల పూరి జగన్నాథ్ కి ఒక రేంజ్ లో పేరు వచ్చిందని చెప్పవచ్చు.అతడు రవితేజ తో తీసిన ఇడియట్, అమ్మ మనం ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

వీటి వల్ల అటు దర్శకుడైన పూరికి, హీరోగా రవితేజ కి ఇండస్ట్రీలో స్టార్ డమ్ వచ్చిందని చెప్పవచ్చు.అలాగే రవితేజ తో మరో దర్శకుడైన శ్రీనువైట్ల కూడా ముచ్చటగా మూడు సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

నీకోసం,వెంకీ, దుబాయ్ శీను ఈ మూడు సినిమాలు తీసి శ్రీను వైట్ల హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు