Sohel : ఆ అమ్మాయి వల్ల రోజూ నరకం చూస్తున్నాను.. సోహెల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ సయ్యద్ సోహెల్( Syed Sohel ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బిగ్బాస్ షో( Bigg Boss ) ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సోహెల్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఊపుతో సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి సోహెల్ పలు సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవలే బూట్ కట్ బాలరాజు( Bootcut Balaraju ) సినిమాతో హీరోగా మారాడు.

ఇటీవల ఫిబ్రవరి 2వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

Tollywood Actor Syed Sohel Shocking Comments About Girls

ఈ సినిమా చూడమంటూ సోహెల్ చాలా ఎమోషనల్ అయ్యాడు.ఏడుస్తూ ప్లీజ్ వీడియోలో కనిపించగా.అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement
Tollywood Actor Syed Sohel Shocking Comments About Girls-Sohel : ఆ అమ్�

అనేక మంది దానిపై ఒక్కో విధంగా స్పందించారు.ఇదంతా ఇలా ఉండగా సోహెల్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశాడు.

ముఖ్యంగా తనను ఒక అమ్మాయి( Lady ) టార్చర్ చేస్తోందనీ, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తూ నరకం చూపిస్తుందని వివరించాడు.ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వేరే వాళ్ల నంబర్ల నుంచి ఫోన్ లు చూస్తూ అవి ఇస్తావా, ఇవి ఇస్తావా, అది కావాలి, ఇది కావాలి అంటూ అడుగుతుందని గలీజ్ గలీజ్ మెసేజ్ లు పెడుతుందని అన్నారు.

మొత్తం 11 నెంబర్ల నుంచి నరకం చూపిస్తున్నట్లు వివరించాడు సోహెల్.

Tollywood Actor Syed Sohel Shocking Comments About Girls

అలాగే తాను ఫోన్ లు లిఫ్ట్ చేయడం మానేస్తే నేరుగా ఇంటికే వచ్చేస్తుందట ఆ అమ్మాయి.ఇది గమనించిన సోహెల్ తల్లి( Sohel Mother ) ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించినా ఆమె టార్చర్ చేయడం ఆపట్లేదని వివరించాడు సోహెల్.ఇదే విషయమై అరియానా తో( Ariyana ) కలిసి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశానని అన్నాడు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అయినా సరే ఫలితం లేకపోయిందని ముఖ్యంగా పోలీసులే వద్దు ఫిర్యాదు చేయకు అని తనకు చెప్పినట్లు తెలిపాడు.నువ్వు అమ్మాయిపై ఫిర్యాదు చేయడం వల్ల ఆమెకు ఏమైనా అయితే నీకే సమస్య అవుతుంది కాబట్టి వదిలేయమంటూ వివరించినట్లు చెప్పుకొచ్చాడు.

Advertisement

పోలీసులు చెప్పడంతో తాను కూడా దీన్ని లైట్ తీసుకున్నానని ఆమె చేసే మెసేజ్ లు, ఫోన్ కాల్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నానని అన్నాడు.భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ప్రూఫ్ ల కింద వీటిని చూపించవచ్చనే దాచి పెడుతున్నట్లు వివరించాడు.

తాజా వార్తలు