నేడే అక్షయ నవమి.. ఈ రోజు ఉసిరి చెట్టుకు ఇలా పూజిస్తే అంతా శుభమే!

దీపావళి పండుగ తర్వాత ఎనిమిది రోజులకు ఉసిరి నవమి వ్రతాన్ని పాటిస్తారు.ప్రతి ఏడాది నవమి వ్రతాన్ని కార్తీక మాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఉసిరి నవమి నవంబర్ 12వ తేదీ వచ్చింది.కనుక నేడు ఉసిరి చెట్టుకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చని పండితులు చెప్తున్నారు.

ఉసిరి నవమిని అక్షయ నవమి అని కూడా పిలుస్తారు.సాధారణంగా ఉసిరి చెట్టును సాక్షాత్తు విష్ణు స్వరూపమని భావిస్తారు అందుకోసమే కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

ఇక అక్షయ నవమి రోజు ఉదయం ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఇలా ఉసిరి చెట్టు కింద భోజనం అనంతరం బ్రాహ్మణులకు, ఇతరులకు దానధర్మాలను చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.

Akshaya Navami, Amla Tress,food, Worship, Hindu Belives
Advertisement
Akshaya Navami, Amla Tress,food, Worship, Hindu Belives-నేడే అక్�

అక్షయ నవమి రోజు ఉసిరి చెట్టుకు పూజ చేసే వారు ఉపవాసంతో పూజ చేయాలి.అక్షయ నవమి రోజు ఉసిరి చెట్టులో విష్ణు దేవుడు కొలువై ఉంటాడు కనుక ఈ చెట్టును పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.ఈ రోజున మహర్షి చ్యవనుడు ఉసిరిని సేవించాడు.

దానివల్ల అతనికి యవ్వనం తిరిగి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అందుకోసమే నేడు ఉసిరిని తినడం ఎంతో మంచిది.అయితే ఈ అక్షయ నవమి రోజు ఉసిరి చెట్టుకు పూజ చేసేవారు ఉపవాసంతో పూజ చేయాలి.

ఇలా నియమనిష్టలతో పూజ చేసిన అనంతరం దానధర్మాలను చేయడం ఎంతో ఉత్తమం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025
Advertisement

తాజా వార్తలు