ఆ భక్తులను పట్టించుకోని.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు..!

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల పుణ్యక్షేత్రానికి( Tirumala ) ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.

ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలలో చాలామంది దేవాలయానికి సంబంధించిన ఉద్యోగులు భగవంతుని సన్నిధిలో భక్తులకు సేవలను అందిస్తూ ఉంటారు.

సేవా భావంతో భక్తులు తరఫున ఆలోచించి వాళ్లకు ఇబ్బంది లేకుండా భగవంతుని దర్శనం చేసుకునేలా ఉద్యోగాన్ని నిర్వహించాలని ముఖ్య అధికారులు చెబుతూ ఉంటారు.కోవిడ్ సమయంలో కొన్ని దర్శనాలను క్యాన్సిల్ చేసిన విషయం కూడా తెలిసిందే.

Tirumala Tirupati Devasthanam Officials Who Ignored Those Devotees , Tirumala Ti

ఎందుకంటే భక్తులు రద్దీ ( devotees )కారణంగా ఇలా చేశారని చెబుతున్నారు.మరి ఆ దర్శనాలకు డబ్బులు కట్టినందుకైనా ఆ భక్తులకు తర్వాత అయినా దర్శనం ఇప్పించాలి కదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.తిరుపతి దేవస్థానం బోర్డు ఇప్పుడు ఆ సేవలకు అనుమతించలేమని వారు బ్రేక్ దర్శనానికి రావచ్చని చెప్పారు.

కోవిడ్ సమయంలో 2020 మార్చి 20- 2021 ఏప్రిల్ 13 వరకు భక్తులను సేవలకు అనుమతించలేదు.స్వామికి ఏకాంతంగా కైంకర్యాలు మాత్రమే నిర్వహించారు.ఈ సమయంలో శ్రీవారికి సుప్రభాతం, అర్చన, అభిషేకం, విశేష పూజ, నిజ పాద సేవా దర్శనం, తోమాల, వసంతోత్సవం, తిరుప్పావడ సేవలను చూసేందుకు 17,764 మంది భక్తులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్నారు.

Advertisement
Tirumala Tirupati Devasthanam Officials Who Ignored Those Devotees , Tirumala Ti

అయితే అప్పుడు కోవిడ్ కారణంగా ఆ నమోదులన్నీ క్యాన్సిల్ అయ్యాయి.ఆ సేవలను దర్శించుకోవడానికి ఎదురుచూస్తున్న భక్తులకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( Tirumala Tirupati Devasthanam Board )వాళ్ళు ఈ కబురూ చెప్పారు.

బ్రేక్ దర్శనం లేదా సొమ్ములు రిటర్న్ తీసుకోవచ్చని సూచించారు.

Tirumala Tirupati Devasthanam Officials Who Ignored Those Devotees , Tirumala Ti

అలాగే ఇందులో భాగంగా 8,965 మంది బ్రేక్ దర్శనం చేసుకోగా, 8917 మంది ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు.మామూలుగా రోజుకు 1000, 500 టికెట్లు ఇస్తూ ఉంటే వీళ్లకు కూడా ఒక్క 50 టికెట్లు ఇస్తే నెమ్మదిగా అందరికీ దర్శన భాగ్యం కలుగుతుంది కదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.కానీ దేవుడి తరపు నుంచి భక్తుల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు