పుచ్చిపోయిన దంతాలను మామూలుగా మార్చే చిట్కాలు..

ప్రస్తుత సమాజంలో చాలామంది పంటి సమస్యలతో బాధపడుతున్నారు.ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చెక్కరతో తయారుచేసిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉన్నారు.

దీని కారణంగా దంతాలు పుచ్చి పోయి వాటిని పీకేయాల్సి వస్తుంది.అయితే ఆ సమయంలో వచ్చే నొప్పి భరించరానిదిగా ఉంటుంది.

దీంతో దంతాన్ని కచ్చితంగా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది.చక్కెర అధికంగా ఉన్న ఆహారం తింటే దంతాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

చక్కెర వల్ల శరీర భాగాలకు కాల్షియం సరిగ్గా అందకపోవడం వల్ల దంతాలు బలహీనంగా తయారవుతాయి.అలాగే శీతల పానీయాలు అయిన సోడా, ఆల్కహాల్‌, జ్యూస్‌లు, ఫిజ్జి డ్రింక్స్ అస్సలు త్రాగకూడదు.

Advertisement

నీళ్లు, ఫ్రూట్ స్మూతీలు, చక్కెర లేని టీ, కాఫీ తాగవచ్చు.నీరు తగినంత తాగితే ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

చక్కెర లేని షుగర్ లెస్ చూయింగ్ గమ్‌లను నమిలితే దంత క్షయం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఎక్కువ కాలం టూత్ బ్రష్‌ను వాడినా దంతాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

కనుక టూత్ బ్రష్‌ను కనీసం 6 నెలలకు ఒకసారి మార్చాల్సిన అవసరం ఉంది.ప్రతి రోజు కనీసం 2 నిమిషాల పాటు అయినా చేసి దంత నలుమూలలను శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలు తొలగిపోతాయి.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

మౌత్ వాష్ యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండడం వల్ల నోట్లో ఉండే బాక్టీరియాను నశింప చేస్తుంది.దంతాల అనారోగ్యం ఉన్న లేకున్నా దంత వైద్యుని దగ్గరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెళ్లి వస్తూ ఉండాలి.విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవాలి.

Advertisement

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.రోజూ ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకుని దాన్ని నోట్లో పోసుకుని 20 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేస్తూ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మార్కెట్‌లో దొరికే కెమికల్ టూత్ పేస్ట్‌ల కన్నా ఇంట్లోనే తయారు చేసుకుని వాడితే దంతాలకు చాలా మంచిది.

తాజా వార్తలు