స్మార్ట్ ఫోన్ లో ఉండే బ్యాటరీ హెల్త్ కండీషన్ చెక్ చేసి, బ్యాటరీ లైఫ్ పెంచే టిప్స్ ఇవే..!

స్మార్ట్ ఫోన్ లో అత్యంత ముఖ్యమైన పరికరం ఏదైనా ఉందంటే అది బ్యాటరీనే.

అయితే బ్యాటరీ హెల్త్ స్టేటస్ చెక్ చేసి, బ్యాటరీ లైఫ్( Battery Life ) పెంచే టిప్స్ గురించి తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ లో( Smartphone ) బ్యాటరీ పనితీరు సరిగా ఉంటేనే, ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది.ఎందుకంటే ఫోన్ ఫోన్ వాడేటప్పుడు భారం అంతా బ్యాటరీ పైనే పడుతుంది.

కాబట్టి బ్యాటరీని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు బ్యాటరీ లైఫ్ స్థితిగతుల వివరాలను తెలుసుకోవాలి.బ్యాటరీ కి సంబంధించి ఏవైనా టెక్నికల్ లోపాలు ఉంటే వెంటనే వాటిని సరి చేసుకోవాలి.

అప్పుడే బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది.స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ హెల్త్( Battery Health ) వివరాలు చూపించే ఫీచర్స్ అనేవి ఇన్ బిల్ట్ గా ఉంటాయి.

Advertisement
Tips To Increase Battery Life Of Android Smartphones Details, Increase Battery

బ్యాటరీ స్టేటస్ లో రెడ్ కలర్ చూపిస్తే దాని జీవితకాలం చివరి దశలో ఉందని అర్థం.ఒకవేళ ఫోన్ లో ఇలాంటి ఆప్షన్స్ కనిపించకపోతే బ్యాటరీ హెల్త్ చెక్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ లను వాడవచ్చు.

CPU-Z, ఆక్యు బ్యాటరీ లాంటి యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి.ఈ యాప్స్ బ్యాటరీ కి సంబంధించిన హెల్త్ కండిషన్స్ అన్ని అందిస్తాయి.

Tips To Increase Battery Life Of Android Smartphones Details, Increase Battery

ఇక ఫోన్లో ఉండే సెట్టింగ్స్ లో బ్యాటరీ సెక్షన్ పై క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది.అక్కడ ఫోన్లో ఉన్న ఏ యాప్ మన బ్యాటరీ ని ఎక్కువగా వాడుకుంటుంది అనే వివరాలు తెలుస్తాయి.బ్యాటరీని ఎక్కువగా తినేస్తున్న యాప్స్ వాడకాన్ని తగ్గించవచ్చు.

కొన్ని అడ్వాన్స్డ్ ఫోన్లలో మన బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉందని విషయాన్ని తెలిపే ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Tips To Increase Battery Life Of Android Smartphones Details, Increase Battery
అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న యూజర్లు ఆండ్రాయిడ్ డయాగ్నోస్టిక్( Android Diagnostics ) చెక్ చేయవచ్చు.దీంతో ఫోన్ వివరాలతో పాటు వైర్లెస్ నెట్వర్క్ వినియోగంతో ముడిపడిన ఇన్ఫో బ్యాటరీ పనితీరు వివరాలు కూడా తెలుసుకోవచ్చు.డయాగ్నోస్టిక్ మెనూ ఓపెన్ కావాలంటే ##4636## నంబర్ ఎంటర్ చేయాలి.

Advertisement

ఈ నెంబర్ ఎంటర్ చేస్తే బ్యాటరీ హెల్త్ వివరాలన్నీ తెలుసుకొని బ్యాటరీ లైఫ్ మెరుగుపరచుకోవచ్చు.

తాజా వార్తలు