నెక్స్ట్ లెవల్లో 'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్.. మాస్ రాజాకు బ్లాక్ బస్టర్ ఖాయం!

మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు.

ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు.

ప్రస్తుతం మరో సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఆ ప్రాజెక్ట్ ఏంటో అందరికి తెలుసు.టైగర్ నాగేశ్వరరావు.

ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.నూతన డైరెక్టర్ వంశీ( Vamsee ) దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్ కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేయగా ఇప్పుడు అదిరిపోయే లెవల్లో నెక్స్ట్ ట్రీట్ ఇచ్చారు.

మాస్ రాజా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) బయోపిక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉందని చెప్పాలి.

ఈ ట్రైలర్ మాత్రం టీజర్ ను మించి ఉంది.ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్ తో పాటు ఎమోషన్స్, ఎలివేషన్స్ వంటివి ఈ సినిమాకు ప్రాణం పోశాయి అనే చెప్పాలి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

రవితేజ దుమ్ములేపాడు.ఈయనతో పాటు కనిపించిన ప్రతీ నటుడు సినిమాలో ఆకట్టు కున్నారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
హాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ హీరోలను పక్కనపెట్టి తెలుగు హీరోల మీద దృష్టి పెడుతున్నారా..?

కంప్లీట్ గా మాస్ ప్యాకేజ్ గా ఈ సినిమా దసరా బరిలోకి దిగబోతుంది అనే చెప్పాలి.చూడాలి ఈ సినిమా భారీ పోటీ మధ్య ఎలా ఆకట్టు కుంటుందో.

Advertisement
https://youtu.be/CdwIA8ZBksQ

తాజా వార్తలు