నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృత్యువాత

నెల్లూరు జిల్లా( Nellore )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కావలి మసునూరు టోల్ ప్లాజా వద్ద లారీని కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.కాగా ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదం( Road Accident )పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

ఈ క్రమంలోనే మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు.చెన్నై నుంచి కొయ్యలగూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు