ఆ రెండు పార్టీలు దూరం.. ఓటర్లు ఎటువైపు ?

తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మద్యనే ఉన్నప్పటికి.

ఇతర పార్టీల హడావిడి కూడా గట్టిగానే జరుగుతోంది.ఇప్పటికే ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక లెఫ్ట్ పార్టీల విషయానికొస్తే.కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నించినప్పటికి.

అవన్నీ వికటించడంతో 17 స్థానాల్లో ఒంటరిపోరు చేసేందుకు వామపక్షాలు సిద్దమయ్యాయి.ఇకపోతే ఏపీ రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలంగాణలో పోటీని వీరంచుకుంది టీడీపీ.

Advertisement

ఇక తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party ) కూడా ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంది.

ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు రేస్ లో ఉండి.అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్న ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు ఎటువైపు మల్లుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో టీడీపీ ప్రభావం ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కొన్ని నియోజిక వర్గాల్లో ఉంది.

ఈ నేపథ్యంలో టీడీపీ సానుభూతి పరులంతా అధికార బి‌ఆర్‌ఎస్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇకపోతే ఎన్నికల నుంచి అనూహ్యంగా తప్పుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎంతో కొంత ఆధారణ ఉంది.

ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) అభిమానులు, సానుభూతిపారులు ఆయా జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

వారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ( Congress party )వైపు వెళ్ళే అవకాశం ఉంది.స్వయంగా షర్మిలనే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో ఆమె పార్టీకి మద్దతు పలికే ఓటర్లంత కాంగ్రెస్ కు గంపగుత్తున ఓటేసే అవకాశం ఉంది.దీంతో ఈ చీలిక ఓటుబ్యాంకు ఏ పార్టీకి ప్లేస్ అవుతుంది ఏ పార్టీ కి మైనస్ అవుతుంది ? ఓవరాల్ గా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ? అనేది విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మద్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది.

Advertisement

మరి ఈ రెండు పార్టీలలో ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తుందా ? లేదా వేరే పార్టీ సత్తా చాటుతుందా ? అనేది చూడాలి.

తాజా వార్తలు