ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. వంకాయను తినకపోవడమే మంచిది..!

సాధారణంగా చెప్పాలంటే వంకాయను తినడానికి చాలామంది ఇష్టపడరు.అలాగే వంకాయ ( Brinjal )నుంచి అనేక రకాల రుచికరమైన వంటకాలు కూడా తయారుచేస్తారు.

అయితే మీరు ఎంతో రుచిగా తినే వంకాయ చాలామందికి పూర్తిగా నిషిద్ధమని చాలా మందికి తెలియదు.అవును మీరు చదివింది నిజమే.

ఆయుర్వేదం ప్రకారం ఇటువంటి ఐదు వ్యాధులు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలలో స్టోన్స్( Kidney stones ) ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండడమే మంచిది.ఎందుకంటే వంకాయలో ఆక్సిలేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది.

రాయిని సృష్టించడానికి ఇది పనిచేస్తుంది.మీరు కిడ్నీలలో రాళ్లతో బాధపడుతున్నప్పటికీ వంకాయలు తీసుకుంటే అది మీ మూత్రపిండల్లో రాళ్ల పరిమాణాన్ని మరింత పెంచుతుంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే మీరు రక్తహీనతతో ( Anemia )బాధపడుతూ ఉంటే పొరపాటున కూడా వంకాయ తీసుకోకూడదు.వంకాయ తినడం వల్ల మన శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.కాబట్టి రక్తహీనత ఉన్న రోగులు అనుకోకుండా మరిచిపోయి కూడా వంకాయ అన్నం తినకూడదు.

ఇంకా చెప్పాలంటే అలర్జీతో ( Allergy )బాధపడుతున్న వారు కూడా వంకాయను తినకూడదు.వంకాయ అలర్జీరకు కారణం అవుతుంది.కాబట్టి మీరు దురద, వాపు మరియు దద్దుర్లు ఎదుర్కొంటున్నట్లయితే మీరు వంకాయను తినకూడదు.

అలాగే తరచుగా కడుపునొప్పి ఉన్నవారు కూడా వంకాయకు దూరంగా ఉండటమే మంచిది.కడుపునొప్పి,( Stomachache ) అజీర్ణం సమస్యలతో బాధపడుతుంటే వంకాయకు దూరంగా ఉండాలి.అలాగే ఏదైనా కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వంకాయను తినకుండా ఉండడమే మంచిది.

మీ కళ్ళలో మంట మరియు వాపు వంటి సమస్యలు ఉంటే మీరు వంకాయలు తినకూడదు.పెద్ద మొత్తంలో వంకాయను తీసుకోవడం వల్ల కంటి సమస్యలు ( Eye problems )వేగంగా పెరుగుతాయి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

కాబట్టి ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వంకాయకు దూరంగా ఉండటమే మంచిది.

Advertisement

తాజా వార్తలు