అమెరికాలో ఈ ఓ మాష్టారు లవ్ పపోజల్ వైరల్ అవుతోంది...!!!!

చాలా మంది ప్రేమికులు తాము ప్రేమించిన వ్యక్తికి లవ్ ప్రపోజ్ చేయాలని ఎంతో ఆరాట పడుతూ ఉంటారు.

అందుకు తగ్గట్టుగా ఎంతో విభిన్నంగా తమ ప్రపోజల్స్ ఉండాలని భావిస్తారు.

వాళ్ళు అనుకున్న విధంగా ప్రేయసికో లేదా ప్రియుడికో ప్రపోజల్స్ చేసి వాళ్ళ ప్రేమని చొరగొంటారు.ఇలాంటి లవ్ ప్రోజల్ ఇప్పుడు అమెరికాలో ఓ మాష్టారు తన తోటి కొలీగ్ కి చేశాడు.

ఆమె ఆ ప్రోజల్ ని ఆనంద బాష్పలతో స్వీకరించింది.ఇప్పుడు ఆ ప్రపోజల్ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

అమెరికాకి చెందిన ఉత్తర కరోలినాలోని విల్మింగ్టన్‌లో ఉన్న ఈస్ట్ సైడ్ చార్టర్ స్కూల్‌ లోని మాష్టారు జారెడ్ అదే స్కూల్ లో పనిచేస్తున్న చెల్సియా అనే అనే మహిళా ఉపాధ్యయురాలికి తన లైఫ్ లాంగ్ గుర్తు ఉండేలా లవ్ ప్రపోజల్ చేశాడు.స్కూల్ లోని తరగతి గదిలో విద్యార్ధులు, మిగిలిన స్కూల్ సిబ్బంది అందరూ ఉండగానే ఆమె దగ్గరకు రాగానే మోకాళ్ళపై నిలబడి లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు.

Advertisement

  ఒక్క సారిగా ఈ పరిణామంతో షాక్ అయిన ఆమె ఆనంద భాష్పాలతో అతడిని హత్తుకుని ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది.తరగతి గదిలోని పిల్లలు విల్ యూ మ్యారీ అని రాసి ఉన్న పలకలు పట్టుకుని ఆమెకి చూపించడం.వాళ్ళ ఇద్దరి మధ్య ప్రపోజల్స్ చూస్తున్న పిల్లలు కేకలు వేయడం అన్నీ వీడియోలో తీయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Advertisement