జుట్టు ఒత్తుగా పెరగాలా, చుండ్రు పోవాలా.. అయితే ఇలా చేయండి!

హెయిర్ గ్రోత్( Hair growth ) లేకపోవడం మరియు చుండ్రు అత్యంత కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ముందుంటాయి.

అయితే ఈ రెండు సమస్యలకు ఒకటే సొల్యూషన్ ఉంది.

అవును, జుట్టును ఒత్తుగా పెంచడంలో మరియు చుండ్రును సంపూర్ణంగా పోగొట్టడంలో ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టానిక్( Natural tonic ) అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

టానిక్ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాయిల్ అయ్యాక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం ( Washed rice )వేసుకోవాలి.అలాగే నాలుగు రెబ్బలు వేపాకు( Neem ) వేసి దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement

ఆపై స్టాప్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి మసాజ్ చేసుకోవాలి.టానిక్ అప్లై చేసుకున్న గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే చుండ్రు సమస్య క్రమంగా దూరమవుతుంది.

స్కాల్ప్ తేమగా ఆరోగ్యంగా మారుతుంది.తలలో దురద, చిరాకు వంటి సమస్యలు తగ్గుతాయి.

అలాగే ఈ టానిక్ తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.

హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఏర్పాటు
అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి కత్తి పట్టబోతున్నాడా..?

ఒత్తైన కురులను కోరుకునే వారికి ఈ టానిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.పైగా ఈ టానిక్ ను వాడడం వల్ల హెయిర్ బ్రేకేజ్ సమస్య తగ్గుతుంది.

Advertisement

మరియు కురులు ఆరోగ్యంగా, దృఢంగా సైతం మారతాయి.

తాజా వార్తలు