మీకు థైరాయిడ్ ఉందా? అయితే ఖ‌చ్చితంగా ఇది మీ డైట్‌లో ఉండాల్సిందే!

ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది థైరాయిడ్ బారిన ప‌డుతున్నారు.ముఖ్యంగా స్త్రీల‌లోనే అధికంగా థైరాయిడ్ బాధితులు ఉంటున్నారు.

థైరాయిడ్‌లోనే రెండు ర‌కాలు ఉన్నాయి.ఒక‌టి హైపో థైరాయిడిజం అయితే.

హైపర్ థైరాయిడిజం మ‌రొక‌టి.అయితే ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెట్టేది హైపో థైరాయిడిజం.

దీని వ‌ల్ల థైరాయిడ్ హార్మోన్లు త‌క్కువగా ఉత్ప‌త్తి అవుతాయి.ఫ‌లితంగా బ‌రువు పెర‌గ‌డం, తీవ్ర‌మైన అల‌స‌ట‌, ఆయాసం, పీరియడ్స్ స‌క్ర‌మంగా రాక‌పోవ‌డం, ఒత్తిడి, ప్రెగ్నెన్సీ రాక‌పోవ‌డం, మ‌ల‌బ‌ద్ధ‌కం, హెయిర్ ఫాల్ ఇలా వివిధ స‌మ‌స్య‌లు తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటాయి.

Advertisement

అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికీ చెక్ పెట్టి థైరాయిడ్‌ను కంట్రోల్‌లో ఉంచ‌డానికి ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా హాఫ్ క‌ప్పు మున‌గాకు తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి.అలాగే ఒక క‌ప్పు పైనాపిల్ ముక్క‌ల‌ను క‌ట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌డిగి పెట్టుకున్న మున‌గాకు, క‌ప్పు పైనాపిల్ ముక్క‌లు, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, హాఫ్ టేబుల్‌ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఆరు నుంచి ఎనిమిది జీడిప‌ప్పులు, వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజ‌లు, ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే పైనాపిల్ మున‌గాకు జ్యూస్ సిద్ధం అవుతుంది.

వారంలో రెండు రోజుల‌కు ఒకసారి ఈ జ్యూస్‌ను తీసుకుంటే థైరాయిడ్ వ్యాధి అదుపులో ఉంటుంది.వెయిట్ లాస్ అవుతారు.నెల‌స‌రి క్ర‌మంగా వ‌స్తుంది.

లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అయితాయి.నీర‌సం, అల‌స‌ట‌, ఆయాసం వంటి స‌మ‌స్య‌ల నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

Advertisement

కాబ‌ట్టి, ఈ హెల్తీ జ్యూస్‌ను ఖ‌చ్చితంగా మీ డైట్‌లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు