జలుబు విపరీతంగా వేధిస్తుందా.. ఇలా చేశారంటే రెండు రోజుల్లో పరారవుతుంది!

జలుబు( Cold ).సాధారణంగా చలికాలం మరియు శీతాకాలంలో మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

కానీ కొందరు మాత్రం సీజన్ తో పని లేకుండా ఎప్పుడు జలుబుతో బాధపడుతూనే ఉంటారు.మిమ్మల్ని కూడా జలుబు విపరీతంగా వేధిస్తుందా.? దాన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదా.? వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే పొడిని తీసుకున్నారంటే రెండు రోజుల్లోనే జలుబు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జ‌లుబును తరిమికొట్టే ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విష‌యాలు తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది యాలకులు వేసుకోవాలి.

అలాగే రెండు అంగుళాల దాల్చిన చెక్కను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.ఆపై అంగుళం ఎండిన అల్లం, చిన్న జాజికాయ ముక్క( Nutmeg ), రెండు నుంచి మూడు స్పూన్లు పసుపు( Turmeric ) వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

This Spicy Milk Helps To Get Rid Of Cold Within Two Days, Spicy Milk, Cold, Hea
Advertisement
This Spicy Milk Helps To Get Rid Of Cold Within Two Days!, Spicy Milk, Cold, Hea

ఇప్పుడు ఒక గ్లాసు తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి, ఒక గ్లాసు వేడి పాలు మరియు వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి( Jaggery Powder ) వేసి బాగా కలిపి సేవించాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే జలుబు దెబ్బకు ఎగిరిపోతుంది.ఈ స్పైసీ మిల్క్ ఇమ్యూనిటీ బూస్టర్( Immunity Booster ) గా పనిచేస్తాయి.

నిత్యం ఈ మిల్క్ ను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం లభిస్తుంది.

This Spicy Milk Helps To Get Rid Of Cold Within Two Days, Spicy Milk, Cold, Hea

కాబట్టి జలుబు విపరీతంగా వేధిస్తుంద‌ని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ స్పైసీ మిల్క్( Spicy Milkk ) ను డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ మిల్క్ పొట్ట కొవ్వును కరిగిస్తాయి.ఊబకాయం( Obesity ) నుంచి బయటపడడానికి తోడ్పడతాయి.

అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులకు ఈ స్పైసీ మిల్క్ ఒక న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తాయి.నిత్యం ఈ మిల్క్ ను తాగితే ఎముకలు దృఢంగా మారి ఆయా సమస్యలు దూరం అవుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు