బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే కచ్చితంగా ఈ స్మూతీ మీ డైట్ లో ఉండి తీరాల్సిందే!

ఇటీవల రోజుల్లో బరువు తగ్గడం కోసం చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.మీరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారా.

? బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారా.? కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? రోజు చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారా? అయితే మీ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరువయ్యేందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.బరువు తగ్గడం కోసం ప్రయత్నించేవారు ఇప్పుడు చెప్పబోయే స్మూతీని ఖ‌చ్చితంగా డైట్ లో చేర్చుకుని తీరాల్సిందే.

ఎందుకంటే వేగంగా మరియు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ స్మూతీ సూపర్ ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మరొక బౌల్ ను తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసి ఒక గ్లాసు వాటర్ పోసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

Advertisement

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ ను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే నానబెట్టుకున్న బాదంపప్పును పొట్టు తొలగించి వేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి మరియు ఒక కప్పు ఆవు పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధమవుతుంది.ఈ స్మూతీ సూపర్ టేస్టీగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటుంది.

ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ స్మూతీ సూపర్ ఎఫెక్టివ్‌ గా పనిచేస్తుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో లేదా నైట్ డిన్నర్ లో ఈ స్మూతీ ని కనుక తీసుకుంటే క్యాలరీలు చాలా త్వరగా బర్న్ అవుతాయి.దీంతో వేగంగా బరువు తగ్గుతారు.

పైగా ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రావు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

పైగా ఎముకలు కండరాలు దృఢంగా సైతం మారతాయి.కాబట్టి వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు