ఈ సింపుల్ రెమెడీ నిర్జీవంగా మారిన చ‌ర్మాన్ని క్ష‌ణాల్లో నిగారింపుగా మారుస్తుంది!

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, కాలుష్యం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, ర‌సాయ‌నాలు అధికంగా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, మేక‌ప్ తొల‌గించ‌కుండా నిద్ర‌పోవ‌డం వంటి కారణాల వ‌ల్ల ఒక్కోసారి ముఖ చ‌ర్మం నిర్జీవంగా మారుతుంటుంది.

దాంతో ఏం చేయాలో అర్థంగాక‌, ఎలా మ‌ళ్లీ ముఖాన్ని నిగారింపుగా మార్చుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌తం అయిపోతుంటారు.

అయితే అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే..

క్ష‌ణాల్లోనే మీ ముఖం నిగారింపుగా మారుతుంది.మ‌రి ఇంకెందుకు లేటు ఈ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక ట‌మాటో, రెండు స్ట్రాబెర్రీల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ట‌మాటో, స్ట్రాబెర్రీ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుండి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇలా స‌ప‌రేట్ చేసుకున్న ట‌మాటో-స్ట్రాబెర్రీ జ్యూస్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి, వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ‌పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, చిటికెడు ఆర్గానిక్ ప‌సుపు, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్ర‌ష్ సాయంతో ముఖానికి, మెడ‌కు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.అప్పుడు వేళ్లతో సున్నితంగా చ‌ర్మాన్ని రుద్దుకుంటూ వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే చ‌ర్మంపై పేరుకుపోయిన డ‌స్ట్‌, డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోతాయి.నిర్జీవంగా ఉన్న చ‌ర్మం క్ష‌ణాల్లో నిగారింపుగా మారుతుంది.

అలాగే ఈ రెమెడీని త‌ర‌చూ ట్రై చేస్తుంటే స్కిన్ వైట్‌గా, టైట్‌గా మారుతుంది.మ‌చ్చ‌లు, మొటిమ‌లు లేని క్లియ‌ర్ స్కిన్ మీసొంతం అవుతుంది.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు