ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.. ఈ రెమెడీని పాటిస్తే మీ చర్మం సహజంగానే వైట్ గా బ్రైట్ గా మారుతుంది!

సాధారణంగా ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి వస్తుందంటే చాలు మగువలు పది రోజుల ముందు నుంచే హడావుడి పడుతుంటారు.

అందరిలోనూ తామే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్( Facials ) చేయించుకుంటూ ఉంటారు.

కానీ ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని పాటిస్తే సహజంగానే మీ చర్మం వైట్ గా, బ్రైట్ గా మరియు సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీని ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడ‌ర్‌, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.

Advertisement

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి.చివరిగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వును రోజ్ వాటర్ తో సహా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

స్కిన్ బ్రైట్ గా, గ్లోయింగ్ గా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.

సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరుస్తారు.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

Royal Panda : Player Safety And Responsible Gambling — An ...
జుట్టు ఎంత పలుచగా ఉన్నా ఇలా చేస్తే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు