కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించిన ఈ రమణారెడ్డి మామూలోడు కాదు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.ముందు నుంచి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా అందరిలోనూ ఉంది.

  దీనికి తగ్గట్లుగానే అనేక సర్వేలు పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని రుజువు చేశాయి.మూడోసారి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలనే పట్టుకోలతో బి.

ఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఒక్క ఛాన్స్ అంటూ ఓటర్ లను సెంటిమెంట్ తో కొట్టిన కాంగ్రెస్ కే పట్టం కట్టారు.ఇది ఇలా ఉంటే ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేశారు.

  అందులో ఒకటి కామారెడ్డి.  కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొడంగల్ నియోజకవర్గంతో పాటు , కామారెడ్డి లోను పోటీ చేశారు.

Advertisement

బీజేపి కామారెడ్డి అభ్యర్థిగా రమణారెడ్డి కేసీఆర్ , రేవంత్ (Ramana Reddy KCR, Revanth)లపై పోటీకి దిగారు.దీంతో కెసిఆర్,  రేవంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేశారు .అయితే ఊహించిన విధంగా రమణారెడ్డి ఇక్కడ ఘన విజయం సాధించారు.

ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి తన సత్తా చాటుకున్నారు.దీంతో రమణారెడ్డి పేరు ఇప్పుడు మారుమగుతోంది .అయితే ఇద్దరు ఉద్దండుల ను పక్కనపెట్టి రమణారెడ్డిని కామారెడ్డి ప్రజలు గెలిపించుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.రమణారెడ్డి స్థానికుడు కావడం , ముఖ్యంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలబడి ఉద్యమాలు,  ఆందోళనలు చేపట్టడం,  స్థానికంగా నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి గత కొంతకాలంగా పోరాటాలు చేయడం వంటివన్నీ రమణారెడ్డి పై స్థానికులు మొగ్గుచూపులానికి కారణంగా అర్థమవుతుంది.

  అదీ కాకుండా, లోకల్ ఫీలింగ్ పెరగడం,  కేసీఆర్ గజ్వేల్, రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, ఇక్కడి నుంచి గెలిచినా రాజీనామా చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరగడం ఇవన్నీ రమణారెడ్డి వైపు కామారెడ్డి ఓటర్లు మొగ్గు చూపించడానికి కారణంగా అర్థమవుతుంది.

కెసిఆర్ కామారెడ్డి తో పాటు గజ్వేల్ లోనూ పోటీ చేశారు.ఇక రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు,  కామారెడ్డి లోనూ పోటీ చేశారు.కామారెడ్డిలో ఈ ఇద్దరు స్నేహితులు ఓడినా,  సొంత నియోజకవర్గం నుంచి గెలిచి ఊరట పొందారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు అభ్యర్థులను ఓడించిన రమణారెడ్డి పేరు మాత్రం ఇప్పుడు మారుమోగుతోంది.

Advertisement

తాజా వార్తలు