ఈ పౌడ‌ర్‌ను వాడితే మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం వైట్ & బ్రైట్‌గా మార‌డం ఖాయం!

ఎలాంటి మ‌చ్చ‌లు లేకుండా ముఖం వైట్‌గా, బ్రైట్‌గా మెరిసిపోవాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, అందుకు విరుద్ధంగా ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

ఏదో ఒక కార‌ణం చేత ముఖంపై మ‌చ్చ‌లు ప‌డి కాంతిహీనంగా కూడా మారుతుంది.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే పౌడ‌ర్‌ను వాడితే గ‌నుక ఎలాంటి మ‌చ్చ‌లు ఉన్నా త‌గ్గిపోయి చ‌ర్మం వైడ్ అండ్ బ్రైట్‌గా మారడం ఖాయం.

మ‌రి లేట్‌ చేయ‌డం ఎందుకు ఆ పౌడ‌ర్ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక‌ క్యారెట్ మ‌రియు కీరాల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.

Advertisement

ఈ తురుము నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో క్యారెట్‌, కీరా జ్యూస్ వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఇలా మ‌రిగిన క్యారెట్‌, కీరా జ్యూస్‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక అందులో ఒక క‌ప్పు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా క‌ల‌పాలి.

ఆ త‌ర్వాత ఈ పిండిని గంట పాటు ఎండ‌లో ఎండ‌బెట్టుకుని.అప్పుడు మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

త‌ద్వారా క్యారెట్‌-కీరా పౌడ‌ర్ సిద్ధం అవుతుంది.ఇక ఈ పౌడ‌ర్‌ను ఎలా స్కిన్‌కి ఉప‌యోగించాలి అన్న‌ది చూద్దాం.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్‌-కీరా పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్, రెండు టేబుల్ స్పూన్ల ట‌మాటో జ్యూస్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్, చిటికెడు ప‌సుపు మ‌రియు వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేశాక ప‌న్నెండు గంట‌ల వ‌ర‌కు సోప్ వాడ‌రాదు.

Advertisement

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం వైట్ అండ్ బ్రైట్‌గా త‌యారు అవుతుంది.