వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే బెస్ట్ అండ్ న్యాచురల్ హెయిర్ క్రీమ్ మీ కోసం!

వింటర్ సీజన్( Winter Season ) రానే వచ్చింది.ఈ కాలంలో ప్రధానంగా చర్మ, కేశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

ముఖ్యంగా జుట్టు తరచూ పొడిబారిపోతూ ఉంటుంది.ఎంత ఖరీదైన షాంపూ, కండీషనర్ వాడినప్పటికీ డ్రై హెయిర్( Dry Hair ) సమస్యకు చెక్ పెట్టలేక పోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ క్రీమ్ మీ సమస్యకు బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.ఈ క్రీమ్ తో చాలా సులభంగా పొడి జుట్టును రిపేర్ చేయవచ్చు.

క్రీమ్ తయారీ కోసం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు( Coconut ) వేసి మెత్తగా గ్రైండ్ చేసి మిల్క్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ లో అర కప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు( Coconut Milk ) వేసుకోవాలి.

Advertisement

అలాగే మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టీ స్పూన్ బాదం నూనె మరియు వన్ టీ స్పూన్ ఆవ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.నాలుగైదు నిమిషాల పాటు స్పూన్ తో కలిపితే మన హెయిర్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

ఇప్పుడు ఈ క్రీమ్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ క్రీమ్ ను కనుక వాడితే పొడి జుట్టు అన్నమాట.

ఈ క్రీమ్ కురులకు చక్కని తేమను అందిస్తుంది.జుట్టును హైడ్రేట్ గా ఉంచుతుంది.

స్మూత్ గా సిల్కీగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ క్రీమ్ ను వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య త‌గ్గుముఖం పడుతుంది.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

జుట్టు ఎదుగుదల మెరుగుపడుతుంది.ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు