వారం రోజుల్లో డార్క్ స‌ర్కిల్స్‌ను మాయం చేసే సూప‌ర్ ఆయిల్ ఇదే!

డార్క్ సర్కిల్స్ లేదా నల్లటి వలయాలు.చాలా మందిని సతమతం చేసే సమస్య ఇది.

ముఖ్యంగా మహిళలు డార్క్ సర్కిల్స్ తో తీవ్రంగా మదన పడుతుంటారు.ఆహారపు అలవాట్లు, హార్మోన్ చేంజెస్, పోషకాల కొరత, నిద్రను నిర్లక్ష్యం చేయడం, బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.

ఈ వలయాలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.అందుకే డార్క్ సర్కిల్స్ ను పోగొట్టుకోవడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలను పాటిస్తారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇకపై డార్క్ స‌ర్కిల్స్‌తో చింతించ‌వ‌ద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఆయిల్‌ను యూస్ చేస్తే కనుక చాలా అంటే చాలా సులభంగా డార్క్ సర్కిల్స్ ను పోగొట్టుకోవచ్చు.

Advertisement

మరి లేటెందుకు ఆ ఆయిల్ ను ఎలా సిద్ధం చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ బీన్స్ ను వేసి మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఈ కాఫీ పొడిలో అర కప్పు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక రోజంతా వదిలేయాలి.మరుసటి రోజు ప‌ల్చ‌టి వస్త్రం సాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ లో హాఫ్‌ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, వ‌న్‌ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని కలిపితే డార్క్ సర్కిల్స్ ను పోగొట్టే మ్యాజికల్ ఆయిల్ సిద్ధం అయినట్టే.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్ ను కళ్ల చుట్టూ అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను ప్రతి రోజు వాడితే.వారం రోజుల్లోనే డార్క్ స‌ర్కిల్స్‌ తగ్గడాన్ని మీరు గమనిస్తారు.పైగా ఈ ఆయిల్ వాడటం వల్ల కళ్ల కింద ముడతలు ఉన్నా మాయం అవుతాయి.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు